Unseasonal rains | మెదక్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలో కురిసిన అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ముఖ్యంగా జిల్లా పరిధిలోని రేగోడు, పెద్ద శంకరంపేట, నర్సాపూర్, మెదక్ ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో కూరగాయలు, మొక్కజొన్న, వరి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మెదక్ జిల్లాలో రేగోడ్‌లో 27.4 మిల్లీ మీటర్, శంకరంపేటలో 20.3 కిలోమీటర్లు, నర్సాపూర్‌లో 17.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగింది. మిగితా మండలాల్లో చినుకులతో కూడిన వర్షం పడింది.
ఇటీవల సాగులో ఉన్న పంటలు కోత దశకు చేరుకున్న సమయంలో కురిసిన వర్షంతో పొలాల్లో నీరు నిలిచిపోయి పంటలు కుళ్లిపోతున్నాయి. కూరగాయల పంటలు పూర్తిగా నేలకూలగా, మొక్కజొన్న, వరి పంటలు కూడా తడిసిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు.
ఇప్పటికే వాతావరణ మార్పులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమకు ఈ అకాల వర్షం మరింత భారంగా మారిందని రైతులు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పంట నష్టాన్ని అంచనా వేసి, బాధిత రైతులకు పరిహారం అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించి నివేదిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
Assembly Elections | అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగే అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన కాంగ్రెస్
Mallikarjun Kharge: మమ్ముల్ని ప్రేమించారు.. మోదీని పెళ్లి చేసుకున్నారు: మల్లిఖార్జున్ ఖర్గే
TS Assembly | యూరియా యాప్ పేరుతో ప్రభుత్వం రైతులను వేధిస్తోంది : మాజీ మంత్రి వేముల