TB Disease | రామాయంపేట, మార్చి 24 : క్షయవ్యాధిని ముందస్తుగా గుర్తిస్తే నివారణ సాధ్యమవుతుందని డి ధర్మారం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు హరిప్రియ పేర్కొన్నారు. ఇవాళ ప్రపంచ టీబీ దినోత్సవం ( Tuberculosis)సందర్బంగా రామాయంపేట మండలం డి ధర్మారం గ్రామంలో పీహెచ్సీ వైద్యురాలు హరిప్రియ అధ్వర్యంలో సిబ్బంది గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.
అనంతరం వైద్యురాలు హరిప్రియ మాట్లాడుతూ.. క్షయవ్యాది నివారణకు మందులు ఉన్నాయన్నారు. టీబీ ఉందని ఎవ్వరు కూడా ఆందోళనకు గురికావద్దని.. టీబీకి వైద్యం ఉందన్నారు. గతంలోనే డి ధర్మారం పరిధిలో నిజాంపేట, రామాయంపేట మండలాలలోని కొంత మందిని క్షయ వ్యాధిగ్రస్తులుగా గుర్తించడం జరిగిందని. వారికి మందుల కిట్లను ప్రభుత్వం ద్వారా అందజేయడం జరిగిందన్నారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ సిబ్బంది ఉన్నారు.