Indian pilgrims | నేపాల్‌లో ఘోర బస్సు ప్రమాదం.. ఏడుగురు భారతీయ యాత్రికులు మృతి
Indian pilgrims : నేపాల్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. భారతీయ యాత్రికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి, పక్కనే ఉన్న లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు భారతీయులు మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు.
Indian pilgrims : నేపాల్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. భారతీయ యాత్రికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి, పక్కనే ఉన్న లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు భారతీయులు మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటన నేపాల్‌లోని గండకి ప్రావిన్స్ పరిధిలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మనకామన టెంపుల్లో దర్శనం అనంతరం 16 మందితో కూడిన మినీ ఎలక్ట్రిక్ బస్ తిరుగు ప్రయాణం ప్రారంభించింది.
ఈ 16 మందిలో ఒక డ్రైవర్, ఒక అసిస్టెంట్, మిగతా 14 మంది భారతీయ యాత్రికులున్నారు. బస్సు కొంత దూరం వెళ్లిన తర్వాత గోర్ఖా జిల్లాలో అదుపు తప్పింది. వెంటనే 200 మీటర్లున్న లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించగా, మరో ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని అన్బుఖైరేనిలోని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నట్లు గోర్ఖా జిల్లా ట్రాఫిక్ పోలీస్ ఆఫీస్ చీఫ్ సూరజ్ అర్యాల్ తెలిపారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. ఘటనపై సమచారం అందిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు.
ప్రమాదానికి కారణమైన ఎలక్ట్రిక్ మినీ బస్సు డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలిస్తున్నామన్నారు. అతడి అసిస్టెంట్‌కు గాయాలు కాగా, అతడు కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

