Sanju Samson | మాది ఐస్, ఫైర్ జోడీ కాదు.. ఇద్దరం అగ్నికి అగ్ని తోడైనట్టే ఆడుతాం..!
Sanju Samson : అభిషేక్‌తో ఇన్నింగ్స్ ఆరంభించడంపై సంజూ మాట్లాడుతూ తమది ఐస్, ఫైర్ జోడీ కాదని.. తామిద్దరం అగ్నికి అగ్ని తోడైనట్టే ఆడుతామనిపేర్కొన్నాడు.
Sanju Samson : పొట్టి ప్రపంచకప్‌లో భారత జట్టు అభిషేక్ శర్మ (Abhishek Sharma)పై భారీ అంచనాలు పెట్టుకుంది. కానీ, అనూహ్యంగా సంజూ శాంసన్ (Sanju Samson) శివాలెత్తిపోయాడు. తొలి బంతి నుంచే విరుచుకుపడే అభిషేక్‌ను కట్టడి చేయడంలో విజయవంతమైన ప్రత్యర్ధి బౌలర్లు.. శాంసన్ ముప్పును ఊహించలేదు. ఫలితంగా.. మెగా టోర్నీలో ఈ వపర్ హిట్టర్ మ్యాచ్ విజేతగా అవరించాడు. అభిషేక్‌తో ఇన్నింగ్స్ ఆరంభించడంపై సంజూ మాట్లాడుతూ తమది ఐస్, ఫైర్ జోడీ కాదని.. తామిద్దరం అగ్నికి అగ్ని తోడైనట్టే ఆడుతామనిపేర్కొన్నాడు.
టీ20 వరల్డ్‌కప్‌లో ఓపెనర్‌గా, మ్యాచ్ విన్నర్‌గా అదరగొట్టాడు సంజూ శాంసన్. లీగ్ దశలో ఒకటే మ్యాచ్ ఆడిన సంజూ.. సూపర్ 8లో ఎంట్రీ ఇచ్చి.. హ్యాట్రిక్ అర్ధ శతకాలతో భారత విజయాల్లో భాగమయ్యాడు. టీమిండియా మూడోసారి పొట్టికప్‌ను గెలవడంలో కీలకమైన ఈ కేరళ బ్యాటర్ తన ఓపెనింగ్ జో డీ అభిషేక్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
Sanju Samson speaks about his his opening partnership with Abhishek Sharma in T20Is 🏏🤝#SanjuSamson #AbhishekSharma #T20WorldCup #CricketTwitter pic.twitter.com/rwR8HApDnC
— InsideSport (@InsideSportIND) March 15, 2026
‘మాది ఐస్, ఫైర్ జోడీ కాదు. మేమిద్దరం ఫైర్ ఉన్న ఆటగాళ్లమే. కొన్నిసార్లు అభిషేక్ ఫైర్ అయితే.. నేను కొన్నిసార్లు ఫైరవుతా. మా ఇద్దరిది ఫైర్ జోడీ. 2024 నుంచి మేము ఇలానే ఆడుతున్నాం. మా ఇద్దరి మధ్య కేరళమ్ – పంజాబీ స్నేహం ఉంది. కాబట్టి మా ఇద్దరి మధ్య సంభాషణ సహజంగానే ఉంటుంది. మేము ఏ విషయాన్ని పెద్దదిగా చేయం. ‘బాల్ ఎలా వస్తుంది?’ అని అభిషేక్ నన్ను అడుగుతాడు. నేను ‘బంతి మామూలుగానే వస్తోంది. సిక్సర్ బాదు’ అని చెబుతాను. ఇలా.. అతడితో ఓపెనింగ్ చాలా సౌకర్యంగా అనిపిస్తుంది. అభిషేక్ చాలా ధైర్యవంతుడు. అన్ని రకాల షాట్లు ఆడగల సమర్ధుడు. అతడి స్వభావం అంటే నాకు ఇష్టం. మైదానంలోపలా అతడితో భాగస్వామ్యాన్ని, మైదానం బయటా అతడితో స్నేహాన్ని నేను చాలా ఇష్టం పడుతా’ అని శాంసన్ వెల్లడించాడు.
ఫైనల్లో 89
సొంతగడ్డపై జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ఓపెనర్‌గా అభిషేక్ శర్మ విఫలమైనా సంజూ శాంసన్ మెరిశాడు. క్వార్టర్ ఫైనల్ లాంటి సూపర్ 8 చివరి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై 97 నాటౌట్లో జట్టును గెలిపించాడు. ఆపై సెమీఫైనల్లోనూ అభిషేక్ త్వరగా ఔటైనా.. ఇంగ్లండ్ బౌలర్లను కాచుకున్న సంజూ 89 పరుగులతో రెచ్చిపోయాడు. ఫైనల్లోనూ ఈ కేరళ స్టార్ దంచేశాడు.

న్యూజిలాండ్ బౌలర్లను బాదేస్తూ అభిషేక్(52)తో కలిసి తొలి వికెట్‌కు 98 రన్స్ జోడించిన సంజూ హాఫ్ సెంచరీ( 89 పరుగులు)తో జట్టుకు భారీ స్కోరందించాడు. ఇషాన్ కిషన్(54), ఆఖర్లో శివం దూబే(26 నాటౌట్) ధనాధన్ ఆటతో కివీస్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది టీమిండియా. అనంతరం.. బుమ్రా(4-15), అక్షర్ పటేల్(3-27) విజృంభణతో బ్లాక్ క్యాప్స్ 159కే కుప్పకూలింది. 96 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసిన భారత జట్టు పొట్టిప్రపంచకప్ను నిలబెట్టుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

