Ram Gopal Varma | ఇండస్ట్రీలో కాంట్రవర్సీస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే సెలబ్రిటీల్లో రాంగోపాల్‌వర్మ టాప్‌లో ఉంటాడని తెలిసిందే. అయితే ఏదో ఒక ట్వీట్‌తో నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచే వర్మ కొన్ని సందర్భాల్లో చేసే కామెంట్స్ అందరినీ ఆలోచింపజేయడమే కాకుండా ప్రత్యేక చర్చకు దారితీసేలా ఉంటాయి. ఇప్పుడలాంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ వర్మ మాట్లాడింది ఏ టాపిక్‌పైన అనే కదా మీ డౌటు.
ప్రస్తుతం మార్కెట్‌ను ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ఎలా శాసిస్తుందో తెలిసిందే. ప్రత్యేకించి ఏఐ ప్రభావం సినీ ఇండస్ట్రీపై చాలా తీవ్రస్థాయిలో పడే ప్రమాదముందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆర్జీవీ కామెంట్స్ ఇదే విషయాన్ని మూవీ లవర్స్‌కు గుర్తు చేస్తున్నాయి.
పోడ్కాస్ట్లో ఆర్జీవీ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఏఐ స్టేటస్ ఎలా ఉందంటే.. బాహుబలి సినిమాను తక్కువ ఖర్చుల్లో తీసెయ్యొచ్చు. బలగం సినిమాను చాలా ఖర్చు అవ్వొచ్చు. దానిక్కారణ్ ఏంటంటే ఎపిక్ సెట్స్, వీఎఫ్ఎక్స్, పెద్ద పెద్ద ప్రొడక్షన్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని అవలీలగా చేసేస్తది.. సెటిల్పర్ఫార్మెన్స్, క్యారెక్టర్స్ పర్పార్మెన్స్ను ఇప్పుడున్న పొజిషన్లో చేయట్లేదు. బలగంను సాధారణంగా కెమెరాలో చేసేయొచ్చు. బాహుబలి ప్రాంప్టర్‌లో చేయొచ్చు. ఖచ్చితంగా ఇదే అని కాదు. బాహుబలి సినిమా 5 లక్షల్లో అయిపోతుంది.. బలగం సినిమా రూ.2కోట్లు అవుతుంది. ఎందుకంటే బాహుబలి సినిమాను కెమెరాలు లేకుండా చేస్తం.
ఇప్పుడు యూఎస్‌లో పెద్ద పెద్ద సూపర్ మ్యాన్లు, స్పైడర్ మ్యాన్లు, అవెంజర్స్ తీసిన మార్వెల్ స్టూడియోస్ వాళ్లు వణికిపోతున్నారు. తీ సినిమా చేయాలంటే సీక్వెన్స్.. అది ఎంత రెజల్యూషన్‌లో వస్తుంది… ఎంత లెంగ్త్ వస్తుంది. 2 నిమిషాలు అలా వచ్చేది.. ఇప్పుడు 12 నిమిషాలు అయిపోయింది.. ఏప్రిల్ 2కు 25 మినిట్స్ అయిపోతుంది. సెప్టెంబర్ నాటికి గంట అయిపోవచ్చు. ఇంకా ముందుకు కూడా రావొచ్చు. ఫస్ట్ హాఫ్, సెకండాఫ్ గంట వచ్చిందంటే.. దాంట్లో తీసేస్తే నువ్వు ఒక ఏసీ రూంలో కూర్చొని.. ఇంక ఇండస్ట్రీ ఏంటీ..? అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
RGV on AI Revolution and how it is evolving..
బాహుబలి 5 లక్షల్లో తీసేయొచ్చు
బలగం 2 కోట్లు ఖర్చు అవుతుంది#RGV #AI pic.twitter.com/mMp9o3c82l
— Tollywood Box Office (@Tolly_BOXOFFICE) March 15, 2026