Scooty | నర్సాపూర్, నవంబర్ 23 : రోడ్డు ప్రమాదంలో ఓ మహిళకు తీవ్రగాయాలైన సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిధిలోని చిన్నచింతకుంట గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ షేక్‌పేటకు చెందిన భార్యాభర్తలు.. మరో మహిళతో కలిసి స్కూటీపై (ముగ్గురు) ఏడుపాయలకు దర్శనానికి వెళ్లారు.
దర్శనం ముగించుకొని హైదరాబాద్‌కు తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో నర్సాపూర్ మండల పరిధిలోని చిన్నచింతకుంట గ్రామసమీపంలోని జాతీయ రహాదారిపై ముందుగా వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేయగా స్కూటీ స్కిడ్ అయ్యి ముగ్గురూ కింద పడిపోయారు. వీరిలో క్రింద పడిపోయిన నిర్మల అనే మహిళ చేయిపై నుండి లారీ టైరు పోవడంతో ఆమె చేయి పూర్తిగా నుజ్జునుజ్జయింది.
స్థానికులు 108కి కాల్ చేయగా ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది ఆమెను నర్సాపూర్ ఏరియా ప్రభుత్వ దవాఖానాకు తరలించారు.
Edupayala | భక్తులతో కిక్కిరిసిన ఏడుపాయల జాతర
Guwahati Test | ముతుస్వామి సూపర్ సెంచరీ.. నాలుగు వికెట్లతో దక్షిణాఫ్రికాను కూల్చిన కుల్దీప్
Vivek Venkataswamy | నర్సాపూర్‌లో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం ఏర్పాటు : మంత్రి వివేక్ వెంకటస్వామి