పాపన్నపేట, నవంబర్ 23 : పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ భవాని మాత సన్నిధిలో ఆదివారం జన జాతర నెలకొంది. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఏడుపాయలకు చేరుకొని దుర్గామాతను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు, ఆదివారం సెలవు దినం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు ఏడుపాయలకు చేరుకున్నారు. దీంతో ఎక్కడ చూసినా భక్తుల సందడి నెలకొంది. ఈ సందర్భంగా పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి ఒడి బియ్యం, కుంకుమార్చనలు, తల నీలాలు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా వేద పండితులు పార్థివ్ శర్మ, రాము, నాగరాజు, రాజశేఖర్ శర్మ తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు రాకుండా ఏడుపాయల ఈవో చంద్రశేఖర్ ఆలయ సిబ్బంది, సూర్య శ్రీనివాస్, ప్రతాప్ రెడ్డి, బ్రహ్మచారి, నర్సింలు, బత్తినీ రాజు,వరుణ చారి,నరేష్, తదితరులు ఏర్పాట్లు చేయగా ఎలాంటి సంఘటనలు జరగకుండా ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తగిన బందోబస్తు ఏర్పాట్లు చేశారు.