Guwahati Test : గువాహటి టెస్టులో భారత బౌలర్ల ఎదురుచూపులు ఫలించాయి. తొలి సెషన్ నుంచి విసిగించిన దక్షిణాఫ్రికా బ్యాటర్ల పోరాటం మూడో సెషన్లో ముగిసింది. బ్యాటింగ్‌కు అనుకూలించిన పిచ్ మీద.. సెనురన్ ముతుస్వామి(109), మార్కో యాన్సెస్ (93) పరుగుల పండుగ చేసుకున్నారు. శతకానికి చేరువైన యాన్సెన్‌ను కుల్దీప్ యాదవ్(4-115) బౌల్డ్ చేసి జట్టు ఇన్నింగ్స్‌కు తెరదించాడు. అప్పటిదాకా సిక్సర్లతో విరుచుకుపడిన యాన్సెస్ బంతిని వికెట్ల మీదకు ఆడుకున్నాడు. దాంతో.. 489 పరుగుల వద్ద సఫారీల పదో వికెట్ పడింది.
ఈడెన్ గార్డెన్స్‌లో కంగుతిన్న భారత జట్టుకు రెండో టెస్టులోనూ దక్షిణాఫ్రికా సవాల్ విసురుతోంది. గువాహటిలో తొలి రోజు టీమిండియా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న సఫారీలు రెండో రోజు భారీ స్కోర్లతో చెలరేగారు. మొదటి సెషన్లో ఆచితూచి ఆడిన ఓపెనర్లు రియాన్ రికెల్టన్(35), ఎడెన్ మర్క్రమ్(38)లు శుభారంభమిచ్చారు. మర్క్రమ్ను బౌల్డ్ చేసిన బుమ్రా ఓపెనర్ల 82 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. ఆ కాసేపటికే కుల్దీప్ ఓవర్లో రికెల్టన్ వికెట్ కీపర్ పంత్‌కు దొరికాడు.
𝘐.𝘊.𝘠.𝘔.𝘐𝐓𝐨𝐩 𝐨𝐟 𝐎𝐟𝐟 👌
How good was that delivery from @Jaspritbumrah93 🫡
Scorecard ▶️ https://t.co/Hu11cnrocG#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/LqsFLEzgAf
— BCCI (@BCCI) November 23, 2025
ఓపెనర్లు ఔటైనా సఫారీ టీమ్ తడబడలేదు. తొలి టెస్టు హీరో కెప్టెన్ తెంబ బవుమా(41), ట్రిస్టన్ స్టబ్స్(49)తో కలిసి ఆపద్భాదవుడి పాత్ర పోషించాడు. వీరిద్దరూ సమయోచితంగా ఆడి స్కోర్ 160 దాటించారు. ప్రమాదకరంగా మారిన ఈ ద్వయాన్ని జడేజా(1-30) విడదీసి ఊరటనిచ్చాడు. అర్ధ శతకానికి చేరువైన స్టబ్స్‌ను కుల్దీప్(3-48) బోల్తా కొట్టించాడు. స్లిప్‌లో కేఎల్ రాహుల్ చక్కని క్యాచ్ అందుకోగా 187 వద్ద నాలుగో వికెట్ పడింది. కీలక వికెట్లు పడినా సఫారీ టెయిలెండర్లు గొప్పగా పోరాడారు.
మరికాసేపట్లో ఆట ముగుస్తుందనగా సిరాజ్ ఓవర్లో టోనీ జోర్జి(28) వెనుదిరిగినా.. రెండో రోజు ముత్తుస్వామి(109), మార్కో జాన్సెన్(93)లు ధనాధన్ ఆడారు. శతక వీరుడు ముతుస్వామిని సిరాజ్ ఔట్ చేశాక.. మరింత దూకుడుగా ఆడిన జాన్సెన్ సెంచరీకి చేరువయ్యాడు. కానీ.. కుల్దీప్ ఓవర్లో అతడు 93 పరుగలు వద్ద బంతిని వికెట్ల మీదకు ఆడుకున్నాడు. అతడి వికెట్‌తో 489 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ ముగిసింది.
⚡Maiden Test 💯 for Senuran Muthusamy! ⚡
He is the third 🇿🇦 batter to register a Test hundred from No.7 or lower vs India after Quinton de Kock (111) in 2019 and Lance Klusener (102) in 1997 #indvssa #SenuranMuthusamy #IndianCricket #CricketTwitter pic.twitter.com/VLmQ90Z5Wg
— Cricbuzz (@cricbuzz) November 23, 2025