GT vs RR : ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన వైభవ్ సూర్యవంశీ(96) క్వాలిఫయర్ 2లో గర్జించాడు. తొలి రెండు ఓవర్లలో రెండు వికెట్లు పడినా ఒత్తిడికి లోనవ్వని ఈ చిచ్చరపిడుగు తన స్టయిల్ విధ్వంసంతో గుజరాత్ టైటాన్స్ బౌలర్లను బెంబేలెత్తించాడు. రవీంద్ర జడేజా(45 నాటౌట్)తో కీలక భాగస్వామ్యం నెలకొల్పిన వైభవ్.. శతకం చేజార్చుకున్నా భారీ స్కోర్‌కు పునాది వేశాడు. ఆఖరి ఓవర్లో ఫెరీరా(38 నాటౌట్) నాలుగు సిక్సర్లతో విరుచుకుపడగా రాజస్థాన్ ప్రత్యర్థి ముందు రెండొందలకుపైగా లక్ష్యాన్ని నిలిపింది.
టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్‌కు క్వాలిఫయర్ 2లో ఆదిలోనే షాక్ తగిలింది. సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఓపెనర్ యశస్వీ జైస్వాల్(1) సిక్సర్ కొట్టబోయి నాలుగో బంతికే ఔటయ్యాడు. గాల్లోకి లేపిన బంతిని ప్రసిధ్ ఒడుపుగా అందుకోగా తొలి వికెట్ పడింది. తర్వాతి ఓవర్లో జురెల్(7)ను ఔట్ చేసిన రబడ(1-21) రెండో వికెట్ అందించాడు. అనంతరం బ్యాటింగ్ ఆర్డర్లో ముందొచ్చిన రవీంద్ర జడేజా(45 నాటౌట్)తో కలిసి వైభవ్ సూర్యవంశీ(96) గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. పవర్ ప్లేలో రాజస్థాన్ 2 వికెట్ల నష్టానికి 70 కొట్టింది.
Youth 🤝 Experience = Big impact 💥
Vaibhav Sooryavanshi and Ravindra Jadeja with a power-packed 5⃣0⃣-run stand 👏
Updates ▶️ https://t.co/eupS8cBPc2#TATAIPL | #Qualifier2 | #TheFinalLeap | #GTvRR pic.twitter.com/EmfjH5zuiH
— IndianPremierLeague (@IPL) May 29, 2026
గాయంతో జడేజా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగగా.. కెప్టెన్ రియాన్ పరాగ్(11) వస్తూనే ఫోర్, సిక్స్‌తో జోరు చూపించాడు. కానీ, హోల్డర్ తెలివైన బౌలింగ్‌లో పరాగ్, శనక(3)ను ఔట్ చేసి రాజస్థాన్‌కు షాకిచ్చాడు. గత మ్యాచ్ హీరో ఆర్చర్(7) సైతం ఔటవ్వగా.. భారీ స్కోరందించే బాధ్యతను వైభవ్ తీసుకున్నాడు. 16వ ఓవర్లో గేర్ మార్చిన వైభవ్… 6, 4, 4 తో రెచ్చిపోయాడు.
He only gets more clutch with each game 😎🩷
Vaibhav Sooryavanshi with 🔙 to 🔙 fifties in the playoffs 👏
Updates ▶️ https://t.co/eupS8cBPc2#TATAIPL | #Qualifier2 | #TheFinalLeap | #GTvRR pic.twitter.com/173szb4Rwp
— IndianPremierLeague (@IPL) May 29, 2026
వరసగా షార్ట్ పిచ్ బంతులు సంధిస్తున్న హోల్డర్‌కు టెన్నిస్ ఫోర్ ఆర్మ్ షాట్లతో దడ పుట్టించాడు. ఆ తర్వాత సుందర్ ఓవర్లో రెండు సిక్సర్లతో శతకానికి చేరువైన అతడు రబడ వేసిన బౌన్సర్‌ను అప్పర్ కట్ ఆడి సుందర్ చేతికి చిక్కాడు. అనంతరం ఫెరీరా(38 నాటౌట్) ధాటిగా ఆడి స్కోర్ రెండొందలు దాటించాడు. రషీద్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో నాలుగు సిక్సర్లు బాదడతో రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో పరుగులు చేసింది.