Hanmakonda : ఓవైపు అకాల వర్షాలతో నష్టపోతున్న రైతన్నలను.. ధాన్యం కొనుగోళ్ల జాప్యంతో విసిగిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. దాంతో, పంటను కొనుగోలు చేయాలని రైతులు ఆందోళనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో సర్కార్ తీరుపై నిరసనగా ఓ రైతన్న ఐకేపీ కేంద్రం వద్ద ఆత్మహత్యాయత్నం చేశాడు. హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం మడిపెల్లి గ్రామంలోని ఐకేపీ కేంద్రం వద్ద శ్రీను గౌడ్ అనే రైతు ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో విసిగిపోయిన శ్రీను గౌడ్ ఐకేపీ సెంటర్ వద్ద ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతడిని గమనించి వెంటనే తోటి రైతులు వెంటనే అడ్డుకోవడడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వర్షాలతో ధాన్యం తడిస్తున్న పరిస్థితులు నెలకొన్న వేళ.. ప్రభుత్వం కొనుగోళ్లలో వేగం పెంచాలని రైతులు డిమాండ్ చేశారు.
ప్రభుత్వం పంట కొనుగోలు చేయడంలేదని రైతన్న ఆత్మహత్యాయత్నం
హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం మడిపెల్లి గ్రామంలోని ఐకేపీ కేంద్రం వద్ద, ప్రభుత్వం తన పంట కొనుగోలు చేయడంలేదని ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మత్యాయత్నానికి పాల్పడ్డ శ్రీను గౌడ్ అనే రైతు
గమనించి వెంటనే అతన్ని అడ్డుకున్న తోటి… pic.twitter.com/g1SSh0LlQP
— Telugu Scribe (@TeluguScribe) May 29, 2026