OPPO Find X9 : చైనాకు చెందిన ఒప్పో సంస్థ నుంచి దేశీయ మార్కెట్లోకి రెండు ఫ్లాగ్షిప్ ఫోన్లు విడుదలయ్యాయి. మంచి ఫీచర్లు, అద్భుతమైన కెమెరా ఎక్స్‌పీరియెన్స్ చేయాలనుకునే వాళ్లు వీటిపై ఓ లుక్కేయొచ్చు. ఒప్పో ఫైండ్ ఎక్స్ 9ఎస్ ధర దాదాపు రూ.లక్ష వరకు ఉండగా, ఒప్పో నుంచి ఫైండ్ ఎక్స్ 9 అల్ట్రా ధర రూ.లక్షన్నరపైమాటే. ధరకు తగ్గట్లే ఫీచర్లు కూడా ప్రీమియం రేంజ్‌లోనే ఉన్నాయి. ఇప్పటికే ఈ ఫోన్ల సేల్స్ ప్రారంభమయ్యాయి. ఆఫ్‌లైన్‌తోపాటు ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్లలోని ప్రధాన ఫీచర్లివి.
ఒప్పో ఫైండ్ ఎక్స్ 9ఎస్
6.59 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్జ్ రిఫ్రెష్‌రేట్, 1,800 నిట్స్ పీక్‌బ్రైట్‌నెస్, ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ఎస్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 16 బేస్డ్ కలర్ ఓఎస్ 16, 12జీబీ+256జీబీ, 12జీబీ+512 జీబీ, 7,025 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 50 ఎంపీ ఓఐఎస్ మెయిన్ కెమెరా+50 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా+50ఎంపీ పెరిస్కోప్ టెలీఫొటో కెమెరా (ట్రిపుల్ కెమెరా), 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, ఐపీ66+ఐపీ68+ఐపీ69 రేటింగ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెషన్, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ వంటి ఫీచర్లున్నాయి. ఈ ఫోన్ బరువు 202 గ్రాములు. లావెండర్ స్కై, మిడ్నైట్ గ్రే, సన్‌సెట్ ఆరెంజ్ కలర్స్‌లో లభ్యం. ధరలు వేరియెంట్‌ను బట్టి రూ.79,999/రూ.89,999. వివిధ కార్డులపై డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు వర్తిస్తాయి.
ఒప్పో నుంచి ఫైండ్ ఎక్స్ 9 అల్ట్రా
ఇది ఫ్లాగ్షిప్ ప్రీమియం ఫోన్. ఇందులో 6.82 అంగుళాల క్యూహెచ్డీ+ ఫ్లెక్సిబుల్ అమోలెడ్ డిస్ప్లే, 1200 హెర్జ్ రిఫ్రెష్‌రేట్, 1,800 నిట్స్ పీక్‌బ్రైట్‌నెస్, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్5 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 16 బేస్డ్ కలర్ ఓఎస్ 16, 12జీబీ+512 జీబీ, 7,050 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్+50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్, 200 ఎంపీ ఓఐఎస్ మెయిన్ కెమెరా+50 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా+200ఎంపీ టెలీఫొటో కెమెరా+50ఎపీ అల్ట్రా టెలీఫొటో కెమెరా (క్వాడ్రపుల్ కెమెరా), 50 ఎంపీ సెల్ఫీ కెమెరా, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెషన్, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ వంటి ఫీచర్లున్నాయి. ఈ ఫోన్ బరువు 235 గ్రాములు. సింగిల్ వేరియెంట్ కాబట్టి ధర రూ.1,69,999. వివిధ కార్డులపై డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు వర్తిస్తాయి.