చేగుంట, మే29 : ప్రభుత్వం ధాన్యంను కొనుగోలు కేంద్రంలో కాంటా పెట్టడం లేదని ఓ రైతు గుళకల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజిపేటలో శుక్రవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మక్కరాజిపేట సాల్కొని చెర్వు తాండకు చెందిన రాట్ల బిక్షపతి ఆత్మహత్యకు యత్నించగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ర్వు తాండకు చెందిన రాట్ల బిక్షపతి అతడి భార్య పేరున గత వారం రోజుల క్రితం సెంటర్కు సుమారు 80 క్వింటాళ్ల ధాన్యం తీసుకు వచ్చాడు. అకాల వర్షాలు పడుతుండడంతో తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో తీసుకుంటారో లేదోనని బిక్షపతి ఆందోళన చెందాడు. ప్రభుత్వం తీరుతో విసిగిపోయిన ఆయన శుక్రవారం రాత్రి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద గుళకల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఈ విషయం తెలుసుకున్న సెంటర్ నిర్వహకులు చేగుంట తహసీల్దార్ శివప్రసాద్, ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు 108 వాహనంలో బిక్షపతిని తూప్రాన్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వైద్యలు అతడికి చికిత్స అందిస్తున్నారు. ఐకేపీలో భిక్షపతి సీరియల్ 115 కాగా ప్రస్తుతం 88 నడుస్తున్నట్లు.. ఆయన సీరియల్ రాగానే కాంటా పెడుతామని చెప్పినట్లు నిర్వహకులు తెలిపారు.