Bike | జహీరాబాద్, మార్చి 22 : గాలి దుమారానికి చెట్టు విరిగిపడి ఇద్దరికీ తీవ్ర గాయాలైన సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ పట్టణ సమీపంలోని షాపూర్ రైల్వే గేట్ సమీపంలో శుక్రవారం రాత్రి జరిగింది. న్యాల్కల్ మండలం శంషోలాపూర్ గ్రామానికి చెందిన అశ్వంత్, లోకేష్ ఇద్దరు కలిసి బైక్‌పై బీదర్‌కు కిరాణా సామాను తీసుకునేందుకు వెళ్లి వస్తున్నారు.
ఈ క్రమంలో షాపూర్ గ్రామ సమీపంలోని రైల్వే గేటు వద్ద ఉన్న బీదర్- జయరాబాద్ రోడ్డు మార్గంపై ఉన్న చెట్టు గాలి దుమారం విరిగి బైక్‌పై పడిపోయింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న వారిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే అక్కడి పోలీసులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అశ్వంత్, లోకేష్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోరుకుంటున్నారని గ్రామస్తులు పేర్కొన్నారు.
Hyderabad | ఎస్టీ హాస్టల్లో పురుగుల అన్నం.. రోడ్డెక్కిన విద్యార్థులు