TPTF | పాపన్నపేట , జూలై 23 : రాష్ట్రప్రభుత్వం పీఆర్సీ రిపోర్ట్ తెప్పించకుండా ఉపాధ్యాయ, ఉద్యోగులను అవమాన పరుస్తుందని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నాయకులు వెల్లడించారు. ఈ మేరకు వారు పాపన్నపేట డిప్యూటీ తహసీల్దార్ చరణ్‌ను కలిసి విజ్ఞాపన పత్రం అందజేశారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ.. ఉపాధ్యాయ, ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, ఏకీకృత సర్వీస్ రూల్స్ రూపొందించి బదిలీలతో కూడిన ప్రమోషన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రెండు సంవత్సరాల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని, పెండింగ్ డీఏలను ప్రకటించాలని కోరారు. ఈ ప్రభుత్వం వచ్చిరెండేళ్లు గడిచిపోయిన తర్వాత పీఆర్సీ రిపోర్టు తెప్పించకపోవడం ఉద్యోగ ఉపాధ్యాయులను అవమానించడమేనని, సీపీఎస్ రద్దు చేయాలని, 317 జీవో ద్వారా నష్టపోయిన ఉద్యోగులకు న్యాయం చేయాలని, మిగిలి ఉన్న పండిట్ ,పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్ చేసి ప్రమోషన్లు కల్పించాలని విజ్ఞప్తి చేసినట్టు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు హీరలాల్ టీపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్, బాలరాజు టీపీటీఎఫ్ మండల అధ్యక్షుడుద, భూషణం యూటీఎఫ్ జిల్లా నాయకులు, శ్రావణ్ కుమార్ యూటీఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులు రఫిక్, తన్మయి తదితరులు పాల్గొన్నారు.
Ganja Seized | ద్విచక్ర వాహనంపై గంజాయి తరలింపు.. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Vice president Elections | ఉపరాష్ట్రపతి ఎన్నికలకు కసరత్తు మొదలుపెట్టిన ఈసీ