Ganja Seized | మునిపల్లి, జులై 23 : ఓ వ్యక్తిగుట్టుచప్పుడు కాకుండా ద్విచక్ర వాహనంపై తరలిస్తుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఎస్ఐ రాజేశ్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. గంజాయిని తరలిస్తున్నట్లుగా అందిన పక్కా సమాచారం మేరకు ముంబయి జాతీయ రహదారిపై కంకోల్ డెక్కన్ టోల్ ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ చేపట్టినట్లు తెలిపారు. ఈ సమయంలో బీదర్ నుంచి హైదరాబాద్ (AP39SK9623) ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకుల నుంచి 500 గ్రాముల గంజాయిని పట్టుకున్నట్లు తెలిపారు. ఇద్దరు గంజాయిని హైదరాబాద్కు తరలిస్తున్నట్లు ఒప్పుకున్నారని ఎస్ఐ వివరించారు. నిందితులను మొజాల ఈశ్వర్ (21), బోయిని నిఖిల్ (19)గా గుర్తించారు. ఈశ్వర్ స్వస్థలం ఏపీలోని గుంటూరు కాగా.. నిఖిల్ది సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం కవెల్లి గ్రామంగా గుర్తించినట్లు తెలిపారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు చెప్పారు. గంజాయి తరలిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు.