Gift A Smile | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గిఫ్ట్ ఏ స్మైల్ స్ఫూర్తితో మాజీ సర్పంచ్ తనవంతు సాయం చేశారు. ఇద్దరు నిరుపేద విద్యార్థులకు ల్యాప్టాప్లు అందజేశారు. ఆదిలాబాద్ జిల్లా ముఖరా కే గ్రామానికి చెందిన ప్రవళిక, మాధవ్ ఇద్దరికీ చదువుల కోసం గాడ్గే మీనాక్షి ల్యాప్టాప్లు అందజేశారు.
ఈ సందర్భంగా గాడ్గే మీనాక్షి మాట్లాడుతూ.. కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని గ్రామంలో పేద విద్యార్థులకు ల్యాప్టాప్లను అందజేశానని తెలిపారు. గ్రామంలో కేటీఆర్ అన్న జన్మదినాన్ని పురస్కరించుకొని వారం రోజుల క్రితం 24 మంది బాలింతలకు కేసీఆర్ కిట్లను అందజేశామని, కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ అన్న అడుగుజాడల్లో పని చేస్తామని తెలిపారు. కేటీఆర్ అన్న ఆశయాలను కొనసాగిస్తామన్నారు, గ్రామంలో ఎవరికి ఏ అవసరం ఉన్నా “గిఫ్ట్ ఏ స్మైల్” లో భాగంగా సహాయం చేస్తామని అన్నారు,ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గాడ్గే సుభాష్ పాల్గొన్నారు.