BRS Rajatotsava Sabha | చిలిపిచెడ్, ఏప్రిల్ 23 : ఈ నెల 27న వరంగల్‌లో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో చిలిపిచెడ్ మండలం నుంచి భారీగా తరలివెళ్తున్నట్లు బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అశోక్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు బెస్త లక్ష్మణ్ తెలిపారు.
బీఆర్ఎస్ (టీఆర్ఎస్)పార్టీ ఆవిర్భవించి 25 ఏండ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగే ఈ సభ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలోని రైతులకు భారీ నష్టం జరిగిందన్నారు. మండలంలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి రజోతోత్సవ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు, ప్రజలకు వారు పిలుపునిచ్చారు.
కేసీఆర్ ప్రభుత్వ పాలనలో దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా ముందుకు సాగిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఆరోపించారు. సభకు మండలం నుంచి అన్ని గ్రామాల్లోని రైతులు, బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున తరలివెళ్లి కేసీఆర్‌కు అండగా ఉందామని పిలుపునిచ్చారు.
KTR | పెంబర్తి వద్ద కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి