KCR | టేక్మాల్, జులై 5: అతనో సాధారణ ఆటో డ్రైవర్.. బీఆర్ఎస్ అంటే అతడికి ఇష్టం.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటే ఎనలేని అభిమానం… తనకు కొడుకు పుడితే కేసీఆర్ పేరు పెట్టుకోవాలనుకున్నాడు. అనుకున్నట్లుగానే మే నెలలో కుమారుడు జన్మించాడు. అతనికి కేసీఆర్ అని నామకరణం చేశాడు. కొడుకు బర్త్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కేసీఆర్ పేరుతో అధికారుల నుంచి బర్త్ సర్టిఫికెట్ను తీసుకున్నాడు.
మెదక్ జిల్లా టేక్మాల్ మండలం ఎల్లుపేట గ్రామానికి చెందిన జక్కుల చిరంజీవి సాధారణ ఆటో డ్రైవర్. అతడి భార్య పేరు చిత్ర. ఈ దంపతులు ఇద్దరికి ఐదుగురు సంతానం. చిరంజీవికి బీఆర్ఎస్ పార్టీ అంటే ఇష్టం. మాజీ సీఎం కేసీఆర్ అంటే ఎనలేని అభిమానం. కేసీఆర్ పట్ల తనకున్న అభిమానంతో తనకు కొడుకు పుడితే కేసీఆర్ అని పేరు పెట్టాలనుకున్నాడు. అయితే అప్పటికే ముగ్గురు సంతానం ఉండగా.. నాలుగవ సంతానంగా కూతురు జన్మించింది.
ఐదో సంతానంగా కొడుకు పుడితే కేసీఆర్ అని పేరు పెట్టాలని నిశ్చయించుకున్నాడు. చిరంజీవి అనుకున్నట్టుగా ఈ ఏడాది మే నెల 21వ తేదీన చిత్ర మగ బిడ్డకు జన్మనిచ్చింది. చిరంజీవి దంపతులు తమ ఐదో సంతానంగా జన్మించిన మగ బిడ్డకు కేసీఆర్ అని నామకరణం చేశారు. కొడుకు బర్త్ డే సర్టిఫికేట్ కోసం చిరంజీవి ఎల్లుపేట గ్రామ పంచాయతీలో దరఖాస్తు చేశాడు.
అధికారులు ఈ మేరకు జక్కుల కేసీఆర్ పేరుతో శనివారం బర్త్ సర్టిఫికెట్ను చిరంజీవి దంపతులకు ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ఆన్నా, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నా తనకు ఎనలేని గౌరవం, అభిమానం అని అందుకే తన కుమారుడికి కేసీఆర్ అని పేరు పెట్టానని జక్కుల చిరంజీవి తెలిపాడు. ఈ విషయం కేసీఆర్ సారుకు తెలియాలని తాను అనుకుంటున్నట్లు చెప్పాడు.
రైతులకు తప్పని తిప్పలు.. మళ్లీ యూరియా కోసం కష్టాలు
RTC Special Bus | అరుణాచల గిరి ప్రదక్షిణకు దిల్సుఖ్నగర్ నుంచి ప్రత్యేక బస్సులు
Leopard | వడ్డేపల్లిలో చిరుత సంచారం.. భయాందోళనలో ప్రజలు