రామాయంపేట, ఫిబ్రవరి 27: కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతకావడం లేదని, సీఎం రేవంత్ అన్నింటా విఫలమయ్యారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హరీశ్‌రావు సమక్షంలో రామాయంపేట పట్టణానికి చెందిన కాంగ్రెస్, బీజేపీల ముఖ్య నాయకులు బీఆర్ఎస్లో చేరారు.
వారికి గులాబీ కండువాలు మెడలో వేసి బీఆర్ఎస్లోకి హరీశ్‌రావు ఆహ్వానించారు. అనంతరం మీడియాతో హరీశ్‌రావు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందన్నారు. హామీలు, ఆరుగ్యారెంటీల అమలులో ప్రభుత్వం విఫలమైందన్నారు.
ప్రజలంతా తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని కోరుతున్నట్లు హరీశ్‌రావు తెలిపారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో కాంగ్రెస్ సీనియర్ నేత దివంగత రొయ్యల పోచయ్య కుమారులు రొయ్యల నవీన్, రొయ్యల మధుకర్, బీజేపీ నాయకులు శివ, అరుణ్‌కుమార్, వంశీ, శ్యాం తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో కోమటిపల్లి కౌన్సిలర్ కొక్కు ప్రవీణ్, ఉమామహేశ్వర్, శ్రీకాంత్ సాగర్, పాతూరి సాయి, హస్నుద్దీన్, నాగార్జున మద్దూరి భాణు, అల్లాడి వెంకటి, రావెల్లి వినయ్ తదితరులు పాల్గొన్నారు.