KTR | ఇటీవల నీట్ స్కాంకు సంబంధించిన కాక్రోచ్ జనతా పార్టీ యువత ఆందోళనను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రస్తావిస్తూ.. యువతరం కదం తొక్కింది.. ఒక కొత్తతరం ఆందోళన అని అన్నారు. నవతెలంగాణ దినపత్రిక 11వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్లో బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్న సెమినార్లో ‘రాజ్యాంగం – ప్రజాస్వామ్యం – పత్రికా స్వేచ్ఛ’ అంశంపై కేటీఆర్ ప్రసంగిస్తూ.. కొత్త తరహా ఆలోచన ఢిల్లీ పుర వీధుల్లో కదం తొక్కితే ముందెవరూ నమ్మలేదన్నారు. యువత ఆందోళనతో ప్రభుత్వం మాత్రమే వణకలేదు.. ఒక రకంగా చెప్పాలంటే మీడియాకు కూడా చెమటలు పట్టించింది. మీకు గుర్తుండాలి.. భజన మీడియాకు అయితే మొత్తం బల్బులు ఎగిరిపోయినయి. అక్కడిపోతే పిల్లలు 20 రోజుల తర్వాత మేం గుర్తొచ్చామా… అని గోదీ మీడియాను డైరెక్టుగా నిలదీస్తుంటే చెమటలు పట్టే పరిస్థితి ఏర్పడిందన్నారు.
ఎందుకంటే ఆ పిల్లల మీద ఈడీ పనిచేయదు.. సీబీఐ పని చేయదు.. ఐటీ పనిచేయదు.. దేనికీ భయపడే బ్యాచ్ కాదది అన్నారు. అందుకే మొన్న చెప్పాను. మోదీ ఎవరితోనైతే పెట్టుకోవద్దన్నానో డైరెక్టుగా వాళ్లతోనే పెట్టుకున్నాడు. ఈ పిల్లలు మామూలోళ్లు కాదు.. మొన్న జరిగిన పోరాటం కూడా వాట్సాప్ యూనివర్సిటీ అంకుల్స్కు, ఇన్స్టాగ్రామ్ పిల్లలకు మధ్యలో జరిగిన పోరాటం. మొదటి రౌండ్లో ఎవరు గెలిచారో మీరు చూశారన్నారు కేటీఆర్.
అర్థరాత్రి జెన్ జీ దెబ్బకు మోదీ అర్ధరాత్రి ఇన్స్టాగ్రామ్లో వీడియో పెట్టాల్సి వచ్చిందని కేటీఆర్ అన్నారు. సోషల్ మీడియాలో కొంతమంది మిత్రులు, మహేశ్ గౌడ్ కూడా మాట్లాడుతూ.. ఫేక్ న్యూస్ కూడా కొన్ని హద్దులు దాటకపోతే బాగుంటుందిని అన్నారు. కానీ ఎవరు గీయాలి హద్దులు ప్రభుత్వాలా..? హద్దులు మరి ఎవరు గీస్తారు..? సంప్రదాయ మీడియానేమో మేనేజ్ చేశారు.. చివరకు ఇక్కడ మేము రాస్తాం.. అప్పుడు పాజిటివ్, అప్పుడప్పుడు నెగెటివ్ వార్తలు రాస్తాం. ఉన్నవి ఉన్నట్టు రాస్తాం.. కానీ యాడ్స్ మాత్రం ఆపకండి..అని అడిగే పరిస్థితి వచ్చిందంటే..? పరిమితులు, స్వేచ్చకు హద్దులు పెడిగే ఇక అది వాక్ స్వాతంత్యం, స్వేచ్చా ఎట్లా అవుతుందన్నారు కేటీఆర్. స్వేచ్చకు పరిమితులుండకూడదు. వాక్ స్వాతంత్యం ఇచ్చాం కాబట్టి దూషణలతో దాడి చేయండి.. వాడి వేడి మాటలతో బూతులు తిట్టండి అని కాదు..కానీ ఖచ్చితంగా ఇవాళ సోషల్ మీడియా లేకపోతే ప్రభుత్వాల్లో ఈ చలనల వచ్చేది కాదు..జవాబు దారితనం కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు.
వాట్సాప్ అంకుల్స్ vs ఇన్స్టాగ్రామ్ పిల్లలు
యువతరం కదం తొక్కితే ప్రభుత్వానికే కాదు.. మోడీ మీడియాకి కూడా బల్బులు ఎగిరిపోయాయి
జెన్ జీ పిల్లలు సీబీఐ, ఈడీకి భయపడే రకం కాదు
మోడీ ఎవరితో పెట్టుకోకూడదో వాళ్ళతో పెట్టుకున్నాడు
– కేటీఆర్ pic.twitter.com/xGOQ6GHu9A
— Telugu Scribe (@TeluguScribe) August 1, 2026
జెన్ జీ దెబ్బకి మోదీ అర్ధరాత్రి ఇన్స్టాగ్రామ్లో వీడియో పెట్టాల్సి వచ్చింది
ట్రెడిషనల్ మెయిన్ స్ట్రీమ్ మీడియాని మేనేజ్ చేసారు
కానీ సోషల్ మీడియా లేకపోతే ఇవాళ ప్రభుత్వాలలో చలనం వచ్చేది కాదు
– కేటీఆర్ https://t.co/cgV3hJUv8K pic.twitter.com/r5AK1unSVh
— Telugu Scribe (@TeluguScribe) August 1, 2026