హైదరాబాద్, ఫిబ్రవరి 27(నమస్తే తెలంగాణ): కృష్ణా నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను అడ్డుకోవాలని తెలంగాణ నీటిపారుదల శాఖ డిమాండ్ చేసింది. ఈ మేరకు కేఆర్ఎంబీ చైర్మన్కు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ లేఖ రాశారు. అనుమతి లేకుండా నిర్మాణాలు ప్రా రంభించిన కొత్త ప్రాజెక్టులతో పాటు పాత ప్రాజెక్టుల విస్తరణను సైతం అడ్డుకోవాలని, మొత్తం 14 ప్రాజెక్టులను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ ప్రాజెక్టుల కింద 291.2 టీఎంసీల నీటిని అదనంగా వాడుకునేందుకు ఏపీ ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు పేర్కొన్నారు. తె లంగాణకు అన్యాయం చేసేలా ఏపీ ప్రభుత్వం చేపడుతున్న ఈ ప్రాజెక్టులను అడ్డుకోవాలని కోరారు.