కాదన్న కాళేశ్వరమే దిక్కయ్యింది. తెలంగాణ నీటి అవసరాలను తీర్చేది అదేనని మరోమారు తేటతెల్లమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-2లో గోదావరి ఎత్తిపోతలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం నంది పంప్‌హౌస్‌లో 4, 5 మోటర్లను ప్రారంభించి నంది రిజర్వాయర్‌లోకి నీటి విడుదలను ప్రారంభించారు.
అక్కడి నుంచి జంట సొరంగాల ద్వారా కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్ గాయత్రీ పంప్‌హౌస్‌కు చేరగా, ఉదయం 9.30 గంటలకు ప్రాజెక్టు అధికారులు ఒకటి, నాలుగు మోటర్లు ప్రారంభించి మల్యాల మండలానికి నీటిని ఎత్తిపోయిస్తున్నారు.