Badi Bata Programme | చిలిపిచెడ్, జూన్ 7 : చిలిపిచెడ్ మండలంలోని అన్ని ప్రాథమిక ,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో బడిబాటను మండల విద్యాధికారి (ఎంఈవో) పి విఠల్ ఘనంగా ప్రారంభించారు. బడిబాటనుద్దేశించి ఎంఈవో విఠల్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమాన్ని ఎవరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా ఉపాధ్యాయులు అందరూ తప్పకుండా పాల్గొనాలన్నారు.
ఉపాధ్యాయులు ఇంటింటిని సందర్శించి విద్యార్థులు పాఠశాలల్లో చేరే విధంగా కృషి చేయాలని సూచించారు. పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు తప్పకుండా ఏదైనా కాలేజీలలో చేరే విధంగా ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. గ్రామంలో ఉన్న డ్రాప్ ఔట్ విద్యార్థులను గుర్తించి పాఠశాలలో చేరే విధంగా కృషి చేయాలి. ఐదు సంవత్సరాలపైబడిన విద్యార్థులు తప్పకుండా స్థానిక ప్రాథమిక పాఠశాలలో చేరే విధంగా ఉపాధ్యాయులు, అంగన్వాడి ఉపాధ్యాయులు కృషి చేయాలని పేర్కొన్నారు.
ఇంటింటికి సర్వే చేసి సర్వే రికార్డుల్లో బడిబాట వివరాలను పొందుపరచాలి. అదేవిధంగా సర్వే చేసిన తర్వాత ప్రతి ఇంటికి నంబరింగ్ వేయాలని నిర్దేశించారు. ప్రభుత్వ పాఠశాలలో గత పదో తరగతి పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలు రావడం జరిగింది. మండలంలో సుమారు 50కి పైగా విద్యార్థులకు 500లకు పైబడి మార్కులు వచ్చాయి. ప్రభుత్వ పాఠశాలలో అనేక రకాలైనటువంటి మౌలిక సదుపాయాలు ప్రభుత్వం కల్పించడం జరిగింది. విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫార్మ్స్, భోజనం, రాగి జావా అందించడం జరుగుతుందన్నారు.
Read Also :
Hospital Staff | అమానుషం.. ఐసీయూలోని రోగికి మత్తుమందు ఇచ్చి అత్యాచారం
Bakrid Celebrations | ఘనంగా బక్రీద్ వేడుకలు.. ఈద్గాల వద్ద ప్రార్థనలు చేసిన ముస్లిములు