ఊట్కూర్ : బక్రీద్ పర్వదిన వేడుకలను(Bakrid celebrations) శనివారం ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ఆయా గ్రామాల్లో ముస్లింలు ఈద్గాల (Eidgahs) వద్దకు చేరుకుని ఈదుల్- అజా ప్రత్యేక నమాజు చేశారు. అనంతరం ఒకరికొకరు ఆ లింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఊట్కూరు మండల కేంద్రంలో జరిగిన బక్రీద్ వేడుకల్లో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి( MLA Vakiti Srihari) పాల్గొని ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
ప్రేమ, త్యాగం, సహనం, పరోపకారానికి ప్రతిరూపకంగా బక్రీద్ వేడుకలు జరుపుకోవడం ఆనందదాయకమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కుల,మతాలకతీతంగా పరమత సహనం పాటిస్తూ సోదర భావంతో కలిసి మెలిసి జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పీఏసీసీఎస్ చైర్మన్ బాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ సూర్య ప్రకాష్ రెడ్డి, మాజీ విండో చైర్మన్ ఎల్కోటి నారాయణ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఎల్కోటి జనార్ధన్ రెడ్డి, విగ్నేశ్వర్ రెడ్డి, కోరం మహేశ్వర్ రెడ్డి, శివ రామరాజు, గోపాల్ రెడ్డి, లింగం, కొక్కు శంకర్, అశోక్, మహమ్మద్ కుర్షీద్, అర్ఫద్ పాల్గొన్నారు.