Sakhi Centres | మెదక్ రూరల్, ఆగస్టు 11 : సఖి కేంద్రాల ద్వారా మహిళల హక్కులపై అవగాహన కల్పించాలని, లైంగిక దాడికి గురైన బాధితులకు అండగా భరోసా సెంటర్స్ రక్షణ కల్పిస్తాయని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. సోమవారం మెదక్ జిల్లా కేంద్రంలో గల భరోసా, సఖి సెంటర్లను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా భరోసా సెంటర్స్ సందర్శించి లీగల్, మెడికల్, చిన్నారుల, కౌన్సిలింగ్ స్టేట్మెంట్ రికార్డింగ్ చేయు గదులను పరిశీలించి భరోసా సెంటర్ నిర్వాహణ తీరును ఆరా తీశారు.
బాధితులకు నైపుణ్యాలు నేర్పించి సమాజంలో ఉన్నతంగా జీవించేలా భరోసా సెంటర్స్ దోహదపడతాయని కలెక్టర్ రాహుల్ రాజ్ ఈ సందర్భంగా అన్నారు. అనంతరం సఖి సెంటర్ ను సందర్శించి నిర్వహణ తీరును నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. సఖి సెంటర్ ద్వారా ఇప్పటివరకు 1391 కేసులు పెట్టామని 1131 కేసులకు వివిధ రకాల న్యాయ సేవలు అందించినట్లు నిర్వాహకులు కలెక్టర్కు వివరించారు.
సఖి కేంద్రానికి వచ్చే బాధితులకు భరోసానిచ్చి న్యాయం అందించేలా చూడాలని కలెక్టర్ ఈ సందర్భంగా నిర్వాహకులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సఖి కేంద్రం నిర్వాహకులు రేణుక, లీగల్ కౌన్సిలర్ నిర్మల, ఐపీ అసిస్టెంట్ రమేష్, ఉమామహేశ్వరి సిబ్బంది భరోసా సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
urea | గన్నేరువరంలో యూరియా కోసం బారులు తీరిన రైతులు
Farmers concern | యూరియా కొరతపై రైతుల ఆందోళన.. పోలీసుల పహారాలో పంపిణీ
Karepalli | కారేపల్లి మండలంలో నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ