MLA Sunitha Lakshma reddy | చిలిపిచెడ్, నవంబర్ 10 : రుచి కోసం కాదు ఆరోగ్యం కోసం ఆహారం తీసుకోవాలని.. అలాగే ఆకుకూరలు, కూరగాయలు తినడం ఆరోగ్యానికి ఎంతో అవసరమని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని జిల్లా ఉన్నత పాఠశాలలో నర్సాపూర్ ప్రాజెక్టు పరిధిలో మండల ఐసీడీసీ సూపర్వైజర్ సంతోషీ మాత ఆధ్వర్యంలో పోషణ మాస వార్షికోత్సవాలు, బాల్య వివాహ నిషేధ చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి హాజరై మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తి రుచి కోసం కాదు ఆరోగ్యం కోసం అన్ని రకాల ఆహార పదార్థాలు తినాలని, ముఖ్యంగా స్థానికంగా దొరికే ఆకుకూరలని తిని ఆరోగ్యంగా ఉండాలన్నారు. ప్రతీ ఆడపిల్లను చదివించి ఉన్నత స్థాయికి ఎదిగేలా చూడాలని, చదువులు చదివించి వారికి ఉద్యోగాలు వచ్చిన తర్వాత పెళ్లిళ్లు చేస్తే రాబోయే కాలంలో మంచి ఆరోగ్యవంతమైన సమాజాన్ని తయారు చేసుకోవచ్చునని సూచించారు.
ఈ సందర్భంగా మండల అంగన్వాడీ టీచర్లు తయారుచేసిన న్యూట్రిషన్ స్టాల్స్‌ను అన్నింటిని చూసి అభినందించారు. అనంతరం పోషణ అభియాన్ కార్యక్రమంలో ఉత్తమ, అంగన్వాడీ టీచర్లకు ఆశా , APM,CA,CC పంచాయతీ కార్యదర్శికి , ఏఎన్ఎం మెడికల్ ఆఫీసర్, హెల్త్ సూపర్వైజర్, పారిశుద్ధ్య కార్మికులకు, ప్రశంస పత్రాలను అందించారు.
బాల్యవివాహాలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలి..
ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా డీడబ్ల్యూవో హేమ భార్గవి మాట్లాడుతూ.. బాల్యవివాహాలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలని, దీనికోసం ప్రతి ఒక్కరి సహాయం సహకారం ఖచ్చితంగా ఉండాలని కోరారు. అనంతరం గర్భిణీలకు సామూహిక శ్రీమంతాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ఐసీడీఎస్ సూపర్ వైజర్ సంతోషిమాత, ఆర్ఐ సునీల్ సింగ్, ఎంపీడీవో ప్రవీణ్ నాయక్, ఏపీఎం గౌరీ శంకర్, వైద్యాధికారి శ్రీకాంత్, ఎస్ఐ నర్సింలు, ఎన్జీవో సునీత, పంచాయతీ కార్యదర్శులు, సీఏలు, సీసీలు, ఆశాలు, అంగన్వాడి టీచర్లు, ఐసీడీసీ సిబ్బంది, షీ టీమ్, సఖి టీం గ్రామస్తులు పాల్గొన్నారు.
Collector Koya Sriharsha | ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు.. పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష