Collector Koya Sriharsha | పెద్దపల్లి , నవంబర్10: ఆయిల్ పామ్ సాగుతో ఆధిక ఆదాయం పొందవచ్చునని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. మొదటి 3ఏళ్లు అంతర్ పంటల సాగుతో ఆదాయం పొందవచ్చని, నాల్గవ సంవత్సరం నుంచి 30 ఏళ్ల దాకా ఎకరానికి రూ.లక్ష దాకా ఆదాయం వస్తుందన్నారు. కలెక్టరేట్లో ఆయిల్ ఫామ్ పంట సాగుపై సోమవారం నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడారు.
ప్రతీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ పరిధిలో ఈ యాసంగిలో కనీసం 100 ఎకరాలలో ఆయిల్ పామ్ పంట సాగు చేయించాలని సూచించారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలో తిరుమల ఆయిల్ కమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు 6 -8 నెలల లోపు పూర్తి అవుతాయని వెల్లడించారు. వరి, పత్తి వంటి పంటలతో పోలిస్తే ఆయిల్ పామ్ సాగుతో అధిక ఆదాయం పొందవచ్చునని, రైతులు ఆయిల్ పామ్ సాగు వైపు అడుగులు వేయాలని కోరారు. జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, జిల్లా సహకార అధికారి శ్రీ మాల, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణి అర్జీలకు ప్రాధానత్య
ప్రజావాణి అర్జీలఅత్యంత ప్రాధాన్యతనిచ్చి సమస్యలను త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దాసరి వేణు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ వనజతో కలిసి కలెక్టర్ పాల్గొని ప్రజల వద్ద దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.