Swami Vivekananda | టేక్మాల్: నేటి తరం యువత స్వామి వివేకానందున్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు, యువజన సంఘాల సమితి మెదక్ జిల్లా మాజీ అధ్యక్షుడు భక్తుల వీరప్ప పేర్కొన్నారు. వివేకానంద జయంతిని పురస్కరించుకుని నవ్యభారతీ యువజన సంఘం అధ్యక్షుడు, బీఆర్ఎస్ జిల్లా యువత కార్యదర్శి నాయికోటి భాస్కర్ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన టేక్మాల్ లోని వివేకానందుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివేకానందుడు యువతను మేల్కొల్పి సన్మార్గంలో నడిపించిన మహనీయుడని తెలిపారు. ఆయన బోధనలతో జాతీయ సమైక్యత, మత సామరస్యాన్ని పెంపొందించారని తెలిపారు. యువతలోని మేధాశక్తిని వెలికి తీయడానికి, సమాజ హితం కోసం ముందుకు నడిపించడానికి వివేకానందుని జీవితాన్ని చదవాలన్నారు. మహనీయుల ఆదర్శాలను నిజ జీవితంలో పాటించినప్పుడే వారికి మనం ఇచ్చే నిజమైన నివాళి అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాయకులు ఎంఏ సలీం, కమ్మరి సిద్దయ్య, సురేష్, సాయిబాబు, మాణిక్యం, సాయి, లక్ష్మణ్ నర్సింహా, శివ, అనీల్, భూమేష్,మోహన్, సతీష్, జయవర్ధన్, బాలక్రిష్ణ, వెంకటేష్, నవీన్, సత్యనారాయణ, కిషన్, దుర్గేష్, తదితరులు ఉన్నారు.
