Kalyan- Tanuja |బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ముగిసి చాలా కాలమే అయిన, ఆ షోలోని కొన్ని బంధాలు మాత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మధ్య చర్చనీయాంశంగానే ఉన్నాయి. ముఖ్యంగా విన్నర్ కళ్యాణ్ పడాల, రన్నర్ తనూజ మధ్య ఉన్న అనుబంధం మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా జరిగిన ఓ పబ్లిక్ ఈవెంట్లో కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, ఇద్దరి మధ్య సంబంధంపై మళ్లీ అనేక సందేహాలకు తావిచ్చాయి. సాధారణంగా బిగ్‌బాస్ సీజన్ ముగిసిన తర్వాత విన్నర్‌పైనే స్పాట్లైట్ ఉంటుంది. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా కనిపించింది. కళ్యాణ్ పడాలతో పాటు తనూజ కూడా అదే స్థాయిలో పాపులారిటీ సంపాదించుకుంది. హౌస్‌లో వీరిద్దరి మధ్య కనిపించిన అండర్స్టాండింగ్, పరస్పర గౌరవం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అందుకే ఫినాలే తర్వాత కూడా ఈ జంటపై ఆసక్తి తగ్గలేదు.
గ్రాండ్ ఫినాలే అనంతరం కళ్యాణ్, తనూజ ఎక్కువగా విడివిడిగానే కనిపించారు. ఫ్యాన్స్ మీట్స్, సెలబ్రేషన్స్ అన్నీ ఎవరి షెడ్యూల్స్ వాళ్లవే. దీంతో “ఇద్దరి మధ్య ఏమీ లేదు” అనే అభిప్రాయం చాలామందిలో ఏర్పడింది. అయితే తాజాగా జరిగిన సంక్రాంతి ప్రత్యేక కార్యక్రమంలో ఇద్దరూ ఒకే స్టేజ్‌పై కనిపించడం, కలిసి డ్యాన్స్ చేయడం మరోసారి చర్చలకు దారితీసింది. ఆ ఈవెంట్లో తనూజ గురించి మాట్లాడిన కళ్యాణ్ పడాల, ఆమె తన జీవితంలో ఎంత ప్రత్యేకమో చెప్పడం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. “నా జీవితంలో ఆమె ఉండటం నాకు అదృష్టం” అన్న తరహా మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇవి చూసిన నెటిజన్లు “ఇది కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమేనా?” అంటూ ప్రశ్నలు వేస్తున్నారు.
బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు కూడా కళ్యాణ్–తనూజ మధ్య ప్రత్యేకమైన బంధం కనిపించేది. పెద్ద గొడవలు లేకుండా, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఆట ఆడటం వీరి ప్రత్యేకత. అదే సమయంలో డైరెక్ట్‌గా ప్రేమని ప్రకటించకుండా, ఎప్పుడూ హద్దులు దాటని విధంగా వ్యవహరించడంతో ఆడియెన్స్ మరింత క్యూరియస్ అయ్యారు. ఇదిలా ఉండగా, బిగ్‌బాస్ తర్వాత తనూజ ఇప్పటికే తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పింది. పలు సందర్భాల్లో ఆమె “కళ్యాణ్ నా బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే” అని చెప్పింది. రిలేషన్షిప్ గురించి వస్తున్న వార్తలను ఖండించింది. అయినా సరే, కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మాత్రం ఈ బంధంపై మళ్లీ చర్చలు మొదలయ్యేలా చేశాయి. ప్రస్తుతం వీరిద్దరూ తమ కెరీర్లపై ఫోకస్ చేస్తున్నప్పటికీ, అభిమానుల ఆసక్తి మాత్రం తగ్గడం లేదు.