Mini Tanks | నిజాంపేట, జూన్ 16 : నిజాంపేటలోని పలు ప్రధాన వీధుల వద్ద గ్రామానికి చెందిన సంఘ సేవకుడు వెల్దుర్థి వెంకటేశ్‌గౌడ్ తన స్వంత నిధులు రూ.1.50 లక్షలతో ఆరు మినీ ట్యాంక్‌ల ఏర్పాటుకు సంబంధించి సోమవారం భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా వెంకటేశ్‌గౌడ్ మాట్లాడుతూ.. గ్రామంలో గ్రామ పంచాయతీ బోరు బావుల వద్ద నీరు వృథా కాకుండా ఉండేందుకు ప్రజల సౌకర్యార్థం మినీ ట్యాంక్‌లను ఏర్పాటు చేస్తున్నానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రామాయంపేట ఏఎంపీ మాజీ డైరెక్టర్ వెంకటేశం, మాజీ ఉప సర్పంచ్ కొమ్మాట బాబు, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గ్రామస్తులు ఇస్తారి, నాగరాజు, తిరుపతి, బాగులు, లక్ష్మన్, ప్రవీణ్ తదితరులు ఉన్నారు.
Inter Results | ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఫస్టియర్‌లో 67.. సెకండియర్‌లో 50శాతం పాస్
OTT | డైరెక్ట్‌గా ఓటీటీలోకి ఉప్పు కప్పురంబు.. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే..!
Narsimhulapeta | ఖాజామియాకు ఆర్థిక సాయం అందజేత