Youth | సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. శివ సాయి (17) అనే యువకుడు తన స్నేహితులతో కలిసి సింగరాయ జాతరకు వెళ్లాడు. అయితే శివ సాయి సింగరాయ వాగులో స్నేహితులతో కలిసి స్నానం చేసే క్రమంలో లోతైన ప్రదేశంలో మునిగిపోయాడు.
వాగులో స్నానం చేస్తున్న వారు ఈ విషయాన్ని గమనించి శివసాయిని బయటికి తీసే లోపే అతడు మృతి చెందాడు. శివసాయిని హుస్నాబాద్ పట్టణానికి చెందిన వాడిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.