Twinkle Khanna | బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, ఆయన భార్య ట్వింకిల్ ఖన్నా తమ వైవాహిక బంధంలో 25 ఏళ్ల మైలురాయిని చేరుకున్నారు. ఈ శుభదినాన్ని పురస్కరించుకుని అక్షయ్ కుమార్ తనదైన శైలిలో ఒక సరదా వీడియోను (Playful Reel) సోషల్ మీడియాలో షేర్ చేశారు. 25 ఏళ్ల వెర్రితనం (25 Years of Madness) అంటూ ఆయన పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అక్షయ్ తన భార్య ట్వింకిల్‌ను సరదాగా ఆటపట్టిస్తూ దశాబ్దాల కాలంగా తమ మధ్య ఉన్న అనుబంధాన్ని ఎంతో అందంగా, హాస్యభరితంగా చూపించారు.
ఈ సందర్భంగా అక్షయ్ ఒక భావోద్వేగమైన నోట్‌ను కూడా రాశారు. నా జీవితంలోని రంగులకు, అల్లరికి, పిచ్చితనానికి కారణం నువ్వే. ఈ 25 ఏళ్లు ఎలా గడిచిపోయాయో కూడా తెలియలేదు. ఇలాంటి వెర్రితనం మరెన్నో ఏళ్లు కొనసాగాలని కోరుకుంటున్నాను అంటూ ట్వింకిల్‌పై తనకున్న ప్రేమని చాటుకున్నారు. బాలీవుడ్లో అత్యంత క్రేజీ కపుల్స్‌లో ఒకరిగా పేరున్న వీరు, 2001లో వివాహం చేసుకున్నారు. అక్షయ్-ట్వింకిల్ జంటకు ఆరవ్ అనే కుమారుడు, నితారా అనే కుమార్తె ఉన్నారు.