Rajkummar Rao and Patralekhaa | బాలీవుడ్ స్టార్ దంపతులు రాజ్ కుమార్ రావు, పత్రలేఖ తమ గారాల పట్టి పేరును అధికారికంగా ప్రకటించారు. గతేడాది నవంబర్ 15న తమ నాలుగో వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ జంటకు ఆడపిల్ల జన్మించగా, నేడు ఆ పాపకు ‘పార్వతి పాల్ రావు’ (ParvatiPaul Rao) అని నామకరణం చేసినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక క్యూట్ ఫోటోను షేర్ చేస్తూ, “చేతులు జోడించి, నిండు మనసుతో మా అతిపెద్ద ఆశీర్వాదాన్ని మీకు పరిచయం చేస్తున్నాము” అంటూ రాసుకొచ్చారు.
అయితే ఈ పేరు వెనుక ఒక ప్రత్యేకత కూడా ఉంది. పత్రలేఖ ఇంటి పేరైన ‘పాల్’ మరియు రాజ్ కుమార్ ఇంటి పేరైన ‘రావు’ను కలిపి, పురాణాల్లో శక్తికి చిహ్నమైన ‘పార్వతి’ పేరును తమ కుమార్తెకు పెట్టినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం షేర్ చేసిన ఫోటోలో పాప ముఖం కనిపించకపోయినప్పటికీ, తన చిట్టి చేతులతో తల్లిదండ్రుల వేళ్లను పట్టుకుని ఉన్న ఆ దృశ్యం నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. ఈ పోస్ట్ చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు కొత్త తల్లిదండ్రులకు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.