Drinking Water | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకమైన మిషన్ భగీరథ్ కార్యక్రమంతో ఇంటింటికి తాగునీరందించిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ సర్కార్ పాలనలో తాగునీటి గోస తప్పడం లేదు. తమకు తాగు నీరు రావడం లేదని సిద్దిపేట జిల్లా ఎల్లారెడ్డి పేట గ్రామంలో గ్రామస్థులంతా రోడ్డెక్కారు.
మహిళలు ఖాళీ బిందెలు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీగా బయలు దేరారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట సీఎం డౌన్ డౌన్ అంటూ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామస్థులు తాగునీటి సమస్యను తీర్చాలని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు ఈ మేరకు ఆందోళన చేపట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో రౌండప్ చేస్తోంది.
తాగు నీరు రావడం లేదని సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన గ్రామస్థులు
సిద్దిపేట జిల్లా ఎల్లారెడ్డి పేట గ్రామంలో తాగునీటి సరఫరా నిలచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న గ్రామస్థులు
తాగునీటి సమస్యను తీర్చాలని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని… pic.twitter.com/qHONkBaVH1
— Telugu Scribe (@TeluguScribe) June 17, 2026
Pawan Kalyan | అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమానిని పరామర్శించిన పవన్ కల్యాణ్
KTR | పానీపూరి తిని అస్వస్థతకు గురైన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలి : కేటీఆర్