Pawan Kalyan | అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమానిని పరామర్శించిన పవన్ కల్యాణ్
Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ మానవత్వాన్ని చాటుకున్నారు. అరుదైన డీఎన్డీ అనే జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ, ఎదుగుదల లేని స్థితిలో, మంచానికే పరిమితమైన యువ అభిమాని కోరికను తీర్చారు. స్వయంగా అభిమాని ఇంటికి వెళ్లి పరామర్శించారు.
Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ మానవత్వాన్ని చాటుకున్నారు. అరుదైన డీఎన్డీ అనే జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ, ఎదుగుదల లేని స్థితిలో, మంచానికే పరిమితమైన యువ అభిమాని కోరికను తీర్చారు. స్వయంగా అభిమాని ఇంటికి వెళ్లి పరామర్శించారు. చికిత్స నిమిత్తం రూ.లక్ష ఆర్థిక భరోసాతో పాటు భగవంతుడి తీర్థప్రసాదాలను అందజేశారు.
హనుమకొండ పట్టణంలోని హనుమాన్ నగర్‌కు చెందిన నిరంజన్ అనే 17 ఏళ్ల బాలుడు అరుదైన వ్యాధితో పోరాడుతున్నాడు. తన చివరి కోరికగా పవన్ కల్యాణ్‌ను కలవాలని ఉందని అభిలాషించారు. తెలంగాణ జనసేన నాయకుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్.. బుధవారం ఉదయం నిరంజన్ ఇంటికి వెళ్లాడు. బాలుడి తల్లిదండ్రులు పొనుగోటి రాంగోపాల్, మానసతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసకున్నారు. కుటుంబసభ్యులకు మనోధైర్యం చెప్పి.. వైద్య ఖర్చుల నిమిత్తం రూ.లక్ష ఆర్థిక సాయం చేశారు.
ఇక లేవలేని స్థితిలో ఉన్న అభిమానిని చూసి పవన్ కల్యాణ్ చలించిపోయారు. అతని మంచంపై కూర్చొని ఆత్మీయంగా హత్తుకున్నారు. నుదుటిపై ముద్దుపెట్టి ఆప్యాయంగా పలకరించారు. చిన్ననాటి నుంచి మీరంటే అభిమానమని నిరంజన్ చెప్పిన మాటలు విని కదలిపోయారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం నుంచి తెప్పించిన వస్త్రాన్ని కప్పి, కల్యాణం అక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు. శ్రీ వేంకటేశ్వర స్వామి తీర్థ ప్రసాదాలను అందించి, భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. రంజన్ ఆరోగ్యం కోసం వరంగల్ విఖ్యాత భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయిస్తానని తెలిపారు. పూజ చేయించి వెండి ప్రతిమను అందజేస్తానని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

