KTR | కేటీఆర్ ఆదేశాలతో చిన్నారులను పరామర్శించిన సిరిసిల్ల బీఆర్ఎస్ నాయకులు
KTR | పానీపూరి తిని అస్వస్థతకు గురైన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వైద్యులకు ఆదేశించారు.
సిరిసిల్ల టౌన్: పానీపూరి( Panipuri ) తిని అస్వస్థతకు గురైన చిన్నారులకు మెరుగైన వైద్యం ( Treatment ) అందించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) వైద్యులకు ఆదేశించారు. ఘటన విషయం తెలుసుకున్న కేటీఆర్ వెంటనే స్థానిక బీఆర్ఎస్ నాయకులను ( BRS Leaders ) అప్రమత్తం చేశారు. చిన్నారులను పరామర్శించి వారికి అవసరమైన మెరుగైన చికిత్స అందేలా చూడాలని ఆదేశించారు.
దీంతో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాప్ స్కాబ్ ఛైర్మన్ కొండూరు రవీందర్ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ , బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చీటీ నరసింహా రావు, పట్టణాధ్యక్షుడు జిందo చక్రపాణి, ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. సంబంధిత అధికారులను చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై ఫోన్ ద్వారా అడిగి తెలుసు కున్నారు. అస్వస్థకు గురైన వారికి ఎటువంటి ప్రమాదం లేదని, చికిత్స అందిస్తున్నారని, త్వరలోనే కోలుకుంటారని బీఆర్ఎస్ నాయకులు తెలపడంతో తనకు ఎంతో రిలీఫ్ ఇచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు.
ప్రస్తుతం వాతావరణంలో వస్తున్న మార్పులు, సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా కలుషిత నీరు, బయట దొరికే చిరుతిండ్ల విషయంలో పిల్లలు, పెద్దలు మరింత జాగ్రత్త వహించాలని ఆయన కోరారు. తంగళ్ళపల్లి మండలం కేసీఆర్‌నగర్‌లో పానీపూరి తిని 12 మంది చిన్నారులు, ఏడుగురు పెద్దలు అస్వస్థకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే వారిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

