Bathukamma | రాయపోల్, జూన్ 19 : జూన్ నాలుగో వారం వచ్చినా వర్షాలు లేకపోవడంతో గ్రామాల్లో వరుణ దేవుడి కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. వర్షాలు కురువాలని కోరుతూ రాయపోల్ మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో మహిళలు బతుకమ్మ ఆట ఆడారు.
మహిళలంతా గురువారం కొత్తపల్లి గ్రామ పంచాయితీ వద్ద నీళ్ల బిందెను మధ్యలో పెట్టుకొని వర్షాలు పడాలని పాటలు పాడుతూ బతుకమ్మ పాటలు పాడుతూ ఆట ఆడారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. రైతులు పొలాల్లో వేసుకున్న పంటలు ఎండిపోతున్నాయని, మరికొందరి రైతుల పంటలు వర్షాలు లేక సరిగ్గా మొలకెత్తలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
మృగశిర కర్త ముగింపు దశకు వచ్చిన ఇంక వర్షాలు కురవడంలేదని, వరుణ దేవుడు కరుణించి వర్షాలు సమృద్ధిగా కురుపించాలని వారు వేడుకున్నారు.
Bonakal : ‘కాంగ్రెస్ నాయకుల నుండి రక్షించండి’
GHMC | ఇదేనా స్వచ్చ సర్వేక్షన్ స్పూర్తి.. చెత్త తరలింపులో బల్డియా నిర్లక్ష్యం
Banjarahills | వర్షాకాలంలో రోడ్ల తవ్వకాలపై నిషేదానికి తూట్లు.. కమిషనర్ ఆదేశాలను తుంగలో తొక్కి పనులు