సౌమిత్ పొలాడి హీరోగా నటిస్తూ సాయి కె.వెన్నంతో కలిసి దర్శకత్వంలో వహించిన యువతరం ప్రేమకథ ‘నిలవే’. సౌమిత్ పొలాడికి జోడీగా శేయాసి సేస్ నటించగా, హర్ష చెముడు, సుప్రియా ఐసోలా మరో జంటగా నటించారు. రాజ్ అల్లాడ, గిరిధర్‌రావు పొలాడి, సాయి కె.వెన్నెం నిర్మాతలు. ఈ నెల 13న వాలెంటైన్స్ డే కానుకగా విడుదలైన ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌ని మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించారు.
మూడేళ్ల కష్టం ఈ సినిమా అనీ, నిజాయతీగా చేసిన ప్రయత్నం ఫలించిందని, థియేటర్లలో ప్రేక్షకుల స్పందన చాలా సంతోషాన్ని ఇచ్చిందని, ఇది జెన్యూన్ హిట్ అనీ హీరో సౌమిత్ పొలాడి నమ్మకంగా చెప్పారు. ఈ విజయం తమ టీమ్ అందరిదీ అని నిర్మాత రాజ్ అల్లాడ అన్నారు. మన ఆలోచన పవిత్రంగా ఉంటే అన్నీ నెరవేరుతాయని ఈ సినిమా విజయం తెలియజేసిందని, సంకల్పం గట్టిగా ఉండబట్టే ఇక్కడ దాకా వచ్చామని దర్శకుడు అభిప్రాయపడ్డారు.