అన్ని నియోజకవర్గాలను కేసీఆర్ అభివృద్ధి చేసిండ్రు
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి పనులకు నిధుల సమస్య గానీ, అధికారులతో కమ్యునికేషన్ గ్యాప్ గానీ ఏ మాత్రం ఉండేది కాదని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ వెల్లడించారు. బీఆర్ఎస్ హయాం లో నిధుల విషయంలో ఎన్నడూ ఇబ్బందులు రాలేదని, అభివృద్ధే లక్ష్యంగా అప్పటి సీఎం కేసీఆర్ పనిచేశారని స్పష్టంచేశారు. బంగారు తెలంగాణ సాధన కోసం కేసీఆర్ కృషి చేశారని కొనియాడారు.
- కాంగ్రెస్ పాలనలో సీఎం వర్గీయులకే నిధులు
- సీఎం రేవంత్‌రెడ్డిపై ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరైనవే : ఎమ్మెల్యే రాజాసింగ్
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి పనులకు నిధుల సమస్య గానీ, అధికారులతో కమ్యునికేషన్ గ్యాప్ గానీ ఏ మాత్రం ఉండేది కాదని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ వెల్లడించారు. బీఆర్ఎస్ హయాం లో నిధుల విషయంలో ఎన్నడూ ఇబ్బందులు రాలేదని, అభివృద్ధే లక్ష్యంగా అప్పటి సీఎం కేసీఆర్ పనిచేశారని స్పష్టంచేశారు. బంగారు తెలంగాణ సాధన కోసం కేసీఆర్ కృషి చేశారని కొనియాడారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరైనవేనని గురువారం సోషల్‌మీడియా వేదికగా సమర్థించారు. బీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్యేగా నిధులు అడిగితే అధికారులు, ముఖ్యమంత్రి స్పందించి మంజూరు చేశారని వివరించారు. సీఎం రేవంత్‌రెడ్డి తన నియోజకవర్గంతో పాటు ఆయన అనుకూల వర్గ ఎమ్మెల్యేలకే ప్రత్యేక నిధులు కేటాయించడం సరైంది కాదని చెప్పారు. సీఎం తీరును ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, సమయం చూసి తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో గోషామహాల్ నుంచే ప్రభుత్వానికి అధిక ఆధాయం వస్తుందని, కానీ నిధులు మాత్రం సున్నా అని విమర్శించారు.
నిధుల కోసం అడుక్కోవాల్సిన దుస్థితి
కాంగ్రెస్ పాలనలో నియోజకవర్గ అభివృద్ధి కోసం జీహెచ్ఎంసీ కమిషనర్, వాటర్ బోర్డు ఎండీ వద్ద నిధులను అడుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని రాజాసింగ్ వాపోయారు. ప్రభుత్వానికి అత్యధికంగా ట్యాక్స్‌లు కడుతున్న గోషామహల్ పరిస్థితి దారుణంగా ఉన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి పాలనలో ఎమ్మెల్యేల ఫోన్లు సైతం జీహెచ్ఎంసీ కమిషనర్, జలమండలి ఎండీతో సహా ఇతర శాఖల అధికారులు ఎత్తడం లేదని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

