వీఎల్టీ నిబంధన వద్దు
ఖాళీ స్థలాలపై విధిస్తున్న వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ (వీఎల్టీ) చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్ స్లాట్లు బుక్ అవుతాయన్న నిబంధనపై రాష్ట్ర రియల్టర్స్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
- రియల్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్
సిటీబ్యూరో, నవంబరు 19 (నమస్తే తెలంగాణ) : ఖాళీ స్థలాలపై విధిస్తున్న వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ (వీఎల్టీ) చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్ స్లాట్లు బుక్ అవుతాయన్న నిబంధనపై రాష్ట్ర రియల్టర్స్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్ర అధ్యక్షుడు నారగోని ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేస్తూ, ప్రభుత్వ నిబంధనల వల్ల సామాన్య, మధ్యతరగతి ప్లాట్ యజమానులు ఆర్థిక భారంతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం ఖాళీ స్థలాల క్యాపిటల్ విలువపై ఏటా 0.5 శాతం వీఎల్టీ వసూలు చేస్తున్నారని, తాజాగా హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలో రిజిస్ట్రేషన్ జరగాలంటే పీటీఐఎన్ లేదా వీఎల్టీఐఎన్ తప్పనిసరి చేశారని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. దీనివల్ల ప్లాట్ కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకోకపోయినా, దానిపై ఎలాంటి ఆదా యం రాకపోయినా ఏటా పన్ను చెల్లించాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వీఎల్టీ చెల్లించని ఓపెన్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లను తిరసరించడం సరికాదన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

