అనుమతుల్లేకుండా నిర్మాణాలొద్దు
అనుమతుల్లేని ప్రాజెక్టుల నిర్మాణంపై తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు కేఆర్ఎంబీ (కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు) సూచించింది.
- ఏపీ, తెలంగాణకు కేఆర్ఎంబీ సూచన
- ఇరు రాష్ర్టాలకు లేఖలు రాసిన బోర్డు
హైదరాబాద్, నవంబర్19 (నమస్తే తెలంగాణ): అనుమతుల్లేని ప్రాజెక్టుల నిర్మాణంపై తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు కేఆర్ఎంబీ (కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు) సూచించింది. ఈ మేరకు కేఆర్ఎంబీ సూపరింటెండింగ్ ఇంజినీర్-2 నామ వెంకటరమణ ఇరు రాష్ర్టాల ప్రభుత్వాలకు లేఖలు రాశారు. ఏపీ సర్కార్ వాటర్‌గ్రిడ్ పేరిట నాగార్జునసాగర్ నుంచి 1.86 టీఎంసీలను తరలించేందుకు అనుమతిలేకుండానే ప్రాజెక్టు పనులను చేపట్టిన విషయమై బీఆర్ఎస్ నిలదీతల తర్వాత తెలంగాణ సర్కార్ కండ్లు తెరచింది.
ఆ తర్వాతే అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ, బోర్డుకు ఫిర్యాదులు చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా బోర్డు స్పందించింది. నీటి వాటాలు, వినియోగాలకు సంబంధించిన అంశాలు ప్రస్తుతం కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-2 ఎదుట వాదనలు కొనసాగుతున్నాయని గుర్తుచేసింది. అవార్డు వెలువడాల్సి ఉన్నదని, అదీగాక బోర్డు అధికార పరిధిపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్నదని గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో వివాదాస్పద అంశాల్లో ఆదేశాలు జారీచేసే విషయంలో తమకు పరిమితులున్నాయని స్పష్టంచేసింది.
బోర్డు అధికార పరిధిపై నోటిఫికేషన్ జారీ రాజ్యాంగ విరుద్ధమని అభ్యంతరం వ్యక్తంచేసిన తెలంగాన ప్రభుత్వం, అదే సమయంలో ఆ నోటిఫికేషన్ ఆధారంగా బోర్డు జోక్యాన్ని కోరడం పరస్పర విరుద్ధమైన వైఖరిగా పేర్కొన్నది. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులను సంబంధిత ట్రిబ్యునల్ నిర్ణయించాల్సి ఉంటుందని పేరొన్నారు. ఇకనైనా కొత్త ప్రాజెక్టులపై తొందరపాటు వద్దని రాష్ర్టాలకు తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

