రంగారెడ్డి కలెక్టర్‌కు శిక్ష రద్దు
కోర్టు ధికరణ కేసులో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సీ నారాయణరెడ్డికి సింగిల్ జడ్జి వేసిన ఆరు నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానాను హైకోర్టు రద్దుచేసింది.
- కోర్టు ధికరణ కేసులో అప్పీలుపై హైకోర్టు తీర్పు
హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): కోర్టు ధికరణ కేసులో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సీ నారాయణరెడ్డికి సింగిల్ జడ్జి వేసిన ఆరు నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానాను హైకోర్టు రద్దుచేసింది. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తురయంజాల్లోని మన్నె ముత్యాలమ్మకుంట పరిధి సర్వే నంబర్లు 536, 537, 657, 658లో ఉన్న రెండు ప్లాట్లను నిషేధిత జాబితా నుంచి తొలగించాలన్న అభ్యర్థనపై నిర్ణయం తీసుకోవాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు పిటిషనర్లు సమర్పించిన వినతిపత్రంపై 60 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీచేశారు.
అయితే ఆ ఉత్తర్వులు అమలు కాలేదంటూ పిటిషనర్లు కోర్టు ధికరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి రంగారెడ్డి కలెక్టర్‌కు ఆరు నెలల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ కలెక్టర్ నారాయణరెడ్డి దాఖలు చేసిన అప్పీలుపై జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ యారా రేణుకతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ సింగిల్ జడ్జి ఆదేశాల అమలుకు అధికారులు చర్యలు తీసుకున్నారని వివరించారు. కలెక్టర్ తహసీల్దార్‌కు రాసిన లేఖతోపాటు ఆర్డీవో సంబంధిత కోర్టుకు పంపిన లేఖలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం కలెక్టర్‌కు విధించిన జైలు శిక్ష, జరిమానాను రద్దు చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

