క్లైమాక్స్‌లో కన్నీళ్లొస్తాయి
అజయ్ దిషన్, ధనుషా జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ ‘బూకీ’. సునీల్, మంచు లక్ష్మి కీలక పాత్రలు పోషించారు. గణేశ్‌చంద్ర దర్శకుడు. రామాంజనేయులు జవ్వాజీ నిర్మాత. హీరో, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ ఈ చిత్రానికి సమర్పకుడు కావడం విశేషం.
అజయ్ దిషన్, ధనుషా జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ ‘బూకీ’. సునీల్, మంచు లక్ష్మి కీలక పాత్రలు పోషించారు. గణేశ్‌చంద్ర దర్శకుడు. రామాంజనేయులు జవ్వాజీ నిర్మాత. హీరో, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ ఈ చిత్రానికి సమర్పకుడు కావడం విశేషం. ఈ నెల 20న సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ ‘సాంకేతికంగా అన్ని విధాలా సినిమా సమర్ధనీయంగా ఉంటుంది. నా ‘మార్గాన్’లో మంచి పాత్ర పోషించిన అజయ్ ఇందులో హీరో. ఈ సినిమాలోని తన నటనను అంతా మెచ్చుకుంటారు. ధనుషా తెరపై చాలా క్యూట్‌గా ఉంది.
ఈ సినిమా క్లైమాక్స్‌లో అందరికీ కచ్చితంగా కన్నీళ్లొస్తాయి. అందరికీ నచ్చే సినిమా ఇది’ అని అన్నారు. ఈ సినిమాలో భాగం కావడం పట్ల మంచు లక్ష్మి ఆనందం వెలిబుచ్చారు. తమిళంలో అద్భుతమైన స్పందన అందుకున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని, ఈ సినిమాలో చాలా పెద్ద సర్ప్రైజ్ ఉందని, అది చూశాక తెలుస్తుందని దర్శకుడు గణేశ్‌చంద్ర తెలిపారు. ఇంకా హీరోహీరోయిన్లు అజయ్ దిషన్, ధనుషా, రైటర్ భాష్యశ్రీ కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

