Road Rules | రామాయంపేట, జూన్ 09 : వాహనాలు నడిపించే ప్రతీ ఒక్కరూ రోడ్డు నిబంధనలు కచ్చితంగా పాటించాలని లేకుంటే జరిమానాలు, కేసులు తప్పవని రామాయంపేట సీఐ వెంకటరాజగౌడ్ అన్నారు. సోమవారం రామాయంపేట జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేసి వాహన డ్రైవర్లకు పలు సూచనలు చేశారు.
వాహనం నడిపించే ప్రతి ఒక్కరూ తమ వాహనానికి సంబంధించిన కాగితాలు, డ్రైవింగ్ లైసెన్సులు కచ్చితంగా వెంటే పెట్టుకోవాలన్నారు. బైకులు నడిపిస్తే హెల్మెట్, ఫోర్ వీలర్స్‌కు సీట్ బెల్టు తప్పనిసరిగా ఉండాలన్నారు. అంతేగాకుండా ఆటోలు నడిపించే వారు సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దన్నారు. వాహనాలను ఎక్కువ స్పీడ్‌గా నడిపించి ప్రమాదాలను కొనితెచ్చుకోవద్దన్నారు.
ఎక్కువ శాతం ప్రమాదాలు మద్యం తాగడం వల్ల జరుగుతున్నాయని డ్రైవింగ్ చేసే ముందు మద్యం ముట్టవద్దన్నారు. మద్యం వల్ల విలువైన ప్రాణాలు పోతున్నాయని తెలిపారు. తన ప్రాణాల మీదకు తెచ్చుకోకుండా జాగ్రత్తగా గమ్యస్తానానికి వెళ్లాలన్నారు. సీఐ వెంట రామాయంపేట ఎస్సై బాలరాజు తదితర పోలీస్ సిబ్బంది ఉన్నారు.
Gudem Mahipal Reddy | అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి: పటాన్చెరు ఎమ్మెల్యే
Naresh | ఏడుపాయల వన దుర్గమ్మ సేవలో నరేష్..