Schools | తొగుట, జనవరి 26 : గ్రామాభివృద్ధితోపాటు పాఠశాలల అభివృద్ధిఫై ప్రత్యేక దృష్టి సారిస్తామని తొగుట మండలంలోని వెంకట్రావుపేట సర్పంచ్ బండారు కవిత స్వామిగౌడ్ తెలిపారు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వెంకట్రావుపేట గ్రామపంచాయతీ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలోని ప్రాథమిక, జిల్లాపరిషత్ పాఠశాలల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన డెస్కులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. డెస్కుల ఏర్పాటు కోసం ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఏర్పాటులో ముందుకు వచ్చిన పంచాయతీ కార్యదర్శి రవీందర్‌ను ఆమె అభినందించారు. పాఠశాల నుండి పలు పోటీలలో జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనపరుస్తున్న విద్యార్థులకు బహుమతులు అందించారు.
ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంలు నహిమా కౌసర్, వెంకటయ్యలు, ప్రముఖ కవి బండకాడి అంజయ్య గౌడ్, ఉప సర్పంచ్ లచోళ్ల లింగం, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Proteins Makthal | జాతీయ జెండావిష్కరణలో అపశృతి.. ఒకరికి గాయాలు, మంత్రి వాకిటి శ్రీహరికి తప్పిన ప్రమాదం : వీడియో
ప్రోటీన్లు కావాలంటే నాన్ వెజ్ తినాల్సిన పనిలేదు.. వీటిని కూడా తినవచ్చు..!