SI Manasa | రాయపోల్, జనవరి 11 : నిషేధిత చైనా మాంజాను ఎవరైనా విక్రయిస్తే చర్యలు తప్పవని రాయపోల్ ఎస్ఐ కుంచం మానస అన్నారు. ఆదివారం ఎస్ఐ మానస మాట్లాడుతూ.. ప్రజల ప్రాణాలు దృష్టిలో ఉంచుకుని, జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వ్యాపారులు, ప్రజలు సహకరించాలని సూచించారు.
చైనా మాంజా వల్ల వాహన దారులు , పాదచారులు, పక్షులు, ప్రజలు గాయపడటమే కాకుండా ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. అందువల్ల ప్రజలు , వ్యాపారులు సహకరించాలన్నారు. లేకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. పండుగలకు ఊరెళ్లేవారు, జాతర్లకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు పాటించాలని.. ఇండ్లలో ఖరీదైన వస్తువులను ఉంచుకోవద్ధని సూచించారు. సంక్రాంతి పండుగ సంబరాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్ఐ మానస పేర్కొన్నారు.
Jaya Krishna | ఘట్టమనేని వారసుడి తొలి అడుగు .. థ్యాంక్యూ బాబాయ్ అంటూ జయకృష్ణ భావోద్వేగ ప్రసంగం