Collector Manu Choudhary | గజ్వేల్, ఏప్రిల్ 28 : భూ భారతితో పెండింగ్ సాదాబైనామా దరఖాస్తులకు పరిష్కారం లభిస్తుందని, భూ సమస్యలను పరిష్కరించే అవకాశం ఉందని సిద్ధిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి అన్నారు. ఇవాళ ఐవోసీ సమావేశ మందిరంలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్‌తో కలిసి పాల్గొని మాట్లాడారు. ముందుగా భూభారతి చట్టంలోని వివిధ అంశాలను అదనపు కలెక్టర్ రైతులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ.. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతీ గ్రామంలో గ్రామ పరిపాలన అధికారులను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మనిషికి ఆధార్ కార్డులాగా భూమికి భూధార్ సంఖ్య కేటాయింపు ప్రణాళికను తీసుకొస్తుందన్నారు. దీని ద్వారా భూ ఆక్రమణలకు చెక్ పెట్టవచ్చన్నారు.
గ్రామాల్లోని ప్రజలకు భూభారతి చట్టంపై ఉన్న సందేహాలను నివృత్తి చేస్తామన్నారు. భూ సమస్యలపై అధికారులు అందించే ఆర్డర్లపై భూ భారతి చట్టం ప్రకారం అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. రెవెన్యూ డివిజన్ అధికారి (ఆర్డీవో) నిర్ణయంపై ఏమైనా అభ్యంతరాలుంటే కలెక్టర్‌కు అప్పీల్ చేసుకునే అవకాశం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో చంద్రకళ, మండల ప్రత్యేకాధికారి సువర్ణ, తహసీల్దార్ శ్రవణ్, ఏఎంసీ చైర్మన్ వంటేరు నరేందర్‌రెడ్డి, ఎంపీడీవో ప్రవీణ్, ఏవో నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Migratory birds | పెరుంగులమ్ రిజర్వాయర్‌లో వలస పక్షుల సందడి.. Video
Mission Bhageeratha | మిషన్ భగీరథపై నిర్లక్ష్యం.. నీరు వృథాగా పోతున్నా పట్టింపే లేదు
PVNR Expressway | పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వేపై రెండు కార్లు ఢీ.. భారీగా ట్రాఫిక్ జామ్