CPI | సిద్దిపేట, జూన్ 15 : ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఉద్యమిస్తామని సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్ అన్నారు. ఆదివారం రోజు సిద్దిపేట జిల్లా కేం్రదంలోని స్థానిక ఎడ్ల గురువారెడ్డి భవన్ లో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కిష్టపురం లక్ష్మణ్ ఆధ్వర్యంలో జరిగిన సీపీఐ సిద్దిపేట పట్టణ16వ మహాసభకు ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా మంద పవన్ మాట్లాడుతూ.. పేద ప్రజలకు ఎర్ర జెండానే భరోసా అని, పేద ప్రజలు, కష్టజీవులు, కర్షకులు, కార్మికుల పార్టీ సీపీఐ అన్నారు. సుదీర్ఘ పోరాటాలు, త్యాగాలతో నిర్మితమైన ఎర్ర జెండా పార్టీ అన్నారు. ప్రభుత్వాలు ప్రజలకు అందించాల్సిన సంక్షేమ పథకాలలో అర్హులకు ప్రాధాన్యత ఇచ్చేలా ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. ప్రతి పంచాయతీలో,పట్టణంలో సిపిఐ ప్రాతినిధ్యం ఉండే విధంగా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అందించాల్సిన సంక్షేమ పథకాలలో అర్హులైన వారందరికీ ప్రాధాన్యత ఇవ్వకుండా అనర్హులకు ఇస్తే పోరాటం చేస్తామన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పై కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు పూర్తి అవగాహనతో ప్రజాసమస్యలపై స్పందించాలని పిలుపునిచ్చారు..
అనంతరం సీపీఐ సిద్దిపేట పట్టణ నూతన కమిటీని 17 మంది కౌన్సిల్ సభ్యులను ఎన్నుకున్నారు. పట్టణ కార్యదర్శిగా గజబీంకార్ బన్సీలాల్, పట్టణ సహాయ కార్యదర్శులుగా ఎస్కే హరిఫ్, కర్ణాల చంద్రంలను, కౌన్సిల్ సభ్యులను ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కనుకుంట్ల శంకర్,అందె అశోక్, పిట్టల మల్లేశం, మిట్టపల్లి సుధాకర్, బెక్కంటి సంపత్,వేల్పుల ప్రసన్న కుమార్, కానుగుల రామనకర్, భిక్షపతి, శ్రీనివాస్, రాజు, సమ్మయ్య,తదితరులు పాల్గొన్నారు.
Sim Card | మీ పేరుతో ఎవరైనా సిమ్‌కార్డు తీసుకున్నారా..? ఎలా తెలుసుకోవాలంటే..?
RFCL | కోలుకుంటున్న ఆర్ఎఫ్సీఎల్ బాధితుడు.. అప్రమత్తతతోనే తప్పిన అగ్ని ప్రమాదం
Free medical camp | దయానంద విద్యా సమితి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం