Mahila sangam | రాయపోల్, అక్టోబర్ 8 : రాయపోల్ మండల మహిళా సమాఖ్య–వీఓఏల సమీక్ష సమావేశం బుధవారం మండల కేంద్రం రాయపోల్‌లోని ఐకేపీ మహిళా సమైక్య భవనంలో జరిగింది. ఈ సమావేశానికి జిల్లా అదనపు డీఆర్డీఓ సుధీర్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. మహిళా సంఘాలు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రధాన భాగస్వాములుగా మారాలని సూచించారు. ప్రతి మహిళా సంఘం బలోపేతం కావడం ద్వారా గ్రామీణాభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. అవసరమైన వారికి ఉపాధి కల్పించాల్సిన అవసరముందని, పీఎంఫ్ఈ,ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, నాటు కోళ్ల పెంపకం వంటి కార్యక్రమాలను మహిళా సంఘాల ద్వారా విస్తృతంగా చేపట్టాలని ఆయన సూచించారు.
మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధిస్తే కుటుంబంతో పాటు సమాజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎపిఎం యాదగిరి,సీసీలు కుమార్,అంజమ్మ, అకౌంటెంట్ రేఖ, అలాగే వివోఎ లు పాల్గొన్నారు.
Actor Srikanth Bharat | మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టాలీవుడ్ నటుడు
The Paradise | దసరా డైరెక్టర్‌తో ‘కిల్’ రాఘవ.. నాని ది ప్యారడైజ్‌పై సూపర్ హైప్