Ponnam Prabhakar | మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేటలో చేసిన రూ.150 కోట్ల భూకబ్జా గురించి వివరించేందుకు బాధితులు పూర్తి ఆధారాలతో మీడియా ముందుకొచ్చారు. బాధితుడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పొన్నం అనూప్ కుమార్, టీపీసీసీ లీగల్ సెల్ అశోక్ కుమారుడు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న కుమారుడు. మాకు 13 ఎకరాల వ్యవసాయ భూమి సిద్దిపేట అర్బన్ మండలానికి ఆనుకొనే ఉంటుంది. అది దాదాపు లక్ష రూపాయలకు గజం విలువ ఉంటుంది. అది ఇప్పుడు రూ.150 కోట్ల విలువ ఉంటుంది. అది మా తాత, తండ్రి, తల్లి ఇప్పటివరకు పశువుల పాలు పిండుకుంటూ.. ఈ రోజు వరకు మా కులవృత్తినే నమ్ముకుంటూ, వ్యవయం చేసుకుంటూ.. 70 సంవత్సరాలకుపైనే ప్రతీ చెట్టూ పుట్ట, ఆ ఊళ్లో ఉన్నవాళ్లు సాక్షులుగా ఉంటరు. ఆ బావులు కూడా ఇప్పుడు ఎవ్వరు తవ్వరు.. మోటబావులంటరు.. ఆ బావులు కూడా ఇప్పుడు కనబడవు. మీరొచ్చి చూసినా కనిపిస్తది. అలాంటి భూమి మీద ఆయన కన్నేసి లేని ఓ కుటుంబ వివాదాన్ని సృష్టించారు.
ఈ భూమి పంచాయతీ ఏవిధంగా సృష్టించబడిందంటే..ఆయన మంత్రి అయిన తర్వాత వచ్చింది ఈ వివాదం. మేము ఈ మైకులు పట్టుకొని రోడ్ల మీదికి ఎందుకొచ్చినమంటే..ఆయన భూమి మీద దృష్టిపెట్టిండు కాబట్టి.. ఆయన మంత్రి అయిండు.. ఆయన చెప్పినట్టు అధికారులంతా వింటరు కాబట్టి.. ఆయన ఎట్లా అంటే అట్లే సరే అనే వ్యక్తులున్నరు ..కాబట్టి వాళ్ల ద్వారా లేని వివాదాలు. లేని సాక్ష్యాలు ఎట్లా సృష్టించిర్రనేది సాక్ష్యాధారాలతో సహా బయపెట్టాడు. ఆ ఆస్తి మొత్తానికి మా ముత్తాత రాగం మల్లయ్య.. ఆయన వరంగల్ వాస్తవ్యులు..ఇక్కడ కాదు. ఆయన నిజాం ప్రభుత్వం ఆజాంజాహి మిల్లులో ఉద్యోగి. ఆయన రిటైరైనంక కూడా మా తాత అందులోకొంతకాలం ఉద్యోగం కూడా చేశారు.
మా తాత రాగం ఎల్లయ్య ఆయనకు ఐదుగురు కుమారులు. ఆయన ఉద్యోగం చేసిండు.. కమ్యూనిస్టు ఉద్యమంలో పాల్గొన్నడు. మిల్లు సంక్షేమం కోసం పాటు పడ్డడు. 1960లో ఆయన రిటైర్మెంట్ డబ్బులతో ఈ భూమి సంపాదించాడు.వరంగల్లో కూడా ఆస్తులు సంపాదించాడు. 1960లో మా తాతను ఆయనే ఇక్కడికి పంపించాడు. అప్పుడు కట్టిన కరెంట్ బిల్లులు, భూమి శిస్తులు కూడా ఇప్పుడెవరి దగ్గర ఉండవు. మేం ఎప్పటి నుంచి ఉన్నం మా కొట్టాలేంటి.. మా పశువులేంటి.. నాగలేండి.. ఎద్దేంది.. వ్యవసాయం అనేది ఆ ఊర్లో కూడా ఎవరిని అడిగినా చెప్తరు. వంశపారంపర్యంగా మా తండ్రి, మేం సాగు చేస్తున్నమా లేదా చెప్తరు. 1960లో సంపాదించి మా నాన్న పుట్టకముందే సిద్దిపేటలో నివాసం ఏర్పాటు చేసుకుని ఇదే ఊరిలో ఆయన సాగుబడి నాగలి కట్టాడు. 1985లో ఆయన ఒక పార్టిషన్ (పంచనామా ) రాశాడు. దాన్ని తక్షిణామా అనే గొలుసుకట్టు రాతలో రాశాడాయనంటూ చెప్పుకొచ్చాడు.
పొన్నం ప్రభాకర్ సిద్దిపేటలో చేసిన రూ.150 కోట్ల భూకబ్జా గురించి పూర్తి ఆధారాలతో ప్రెస్ ముందుకు వచ్చిన బాధితులు
పొన్నం ప్రభాకర్ తన అన్న కొడుకు పొన్నం అనూప్ కుమార్ పేరుపై సిద్దిపేటకు ఆనుకోని ఉన్న తమ 13 ఎకరాల భూమిని కబ్జా చేశాడు
ఇది గజం రూ.1 లక్ష ధరతో రూ.150 కోట్ల విలువ గల భూమి… https://t.co/oR0cMNiGwA pic.twitter.com/5YvXbfVBrG
— Telugu Scribe (@TeluguScribe) April 16, 2026
సిద్దిపేటలో భూమి కబ్జా చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
తన అన్న కొడుకు పేరిట అక్రమ పట్టాలు తయారు చేయించి కబ్జాకు యత్నిస్తున్న పొన్నం pic.twitter.com/GMTb8kpD71
— Telugu Scribe (@TeluguScribe) April 15, 2026
Hyderabad | దారుణం.. జ్యూస్ అని చెప్పి నాలుగేళ్ల బాలుడికి యాసిడ్ తాగించిన పిన్ని
Karepalli | రోడ్డు ప్రమాద నివారణకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
Loksabha: ఆ బిల్లులపై చర్చకు 251 మంది అనుకూలం.. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఓటింగ్